దారుణం.. కొత్త నోట్ల కోసం ఏటీఎమ్ ద‌గ్గ‌ర‌ వెయిట్ చెయ్య‌లేక ఈ అమ్మాయి టాప్ లెస్‌గా మారింది..!

untitled-5

 

మోదీ గారూ, చూస్తున్నారా..? ప‌్ర‌జ‌ల‌లో చెల‌రేగుతున్న ఈ అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఏటీఎమ్‌ల ముందు గంట‌ల త‌ర‌బ‌డి కొత్త నోట్ల కోసం వెయిట్ చేస్తున్నారు జ‌నాలు. కొన్ని గంట‌లు ఓపిగ్గా నిల‌బ‌డ్డా, బ్యాంక్‌ల నుంచి, ఏటీఎమ్‌ల నుంచి వ‌స్తున్న మ‌నీ 4వేలు మాత్ర‌మే. కొన్ని చోట్ల నోట్ల కొర‌త‌తో అది కూడా రావ‌డం లేదు. దీంతో, జ‌నాల‌లో ఓపిక న‌శిస్తోంది. స‌హ‌నం కోల్పోతున్నారు. అవినీతి పరుల భ‌ర‌తం ప‌ట్ట‌డం ఏమో కానీ, సామాన్య ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు మాత్రం ఇప్పుడ‌ప్పుడే తీరేలా లేవు.

ఢిల్లీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇప్పుడు దేశం మొత్తం సిగ్గుపడేలా చేస్తోంది. దేశ రాజ‌ధానిలోని ఘ‌జియాపూర్‌లోని ఓ ఏటీఎమ్ ద‌గ్గ‌ర సుమారు నాలుగు గంట‌ల పాటు ఓ యువ‌తి మ‌నీ కోసం క్యూలో నిలుచుంద‌ట‌.. అంత సేపు నిరీక్షించినా.. ఆమె క్యూ త‌ర‌గ‌లేదు. డబ్బులు ఇప్పుడ‌ప్పుడే అందేలా క‌నిపించ‌లేదు. దీంతో, ఆ యువ‌తి ఊహించ‌ని రీతితో స్పందించింది. త‌న టాప్ విప్పేసి పై బాడీకి ఎలాంటి ఆచ్చాద‌న లేకుండా అంద‌రి ముందు నిల‌బ‌డింది. అక్క‌డున్న మ‌హిళ‌లు వారిస్తున్నా.. ఆమెకు వ‌ద్ద‌ని చెబుతున్నా ఏమాత్రం కేర్ చెయ్య‌లేదు. టాప్ లెస్‌గా మారిపోయింది. క్ష‌ణాల్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు అక్క‌డి జ‌నాలంతా విస్మ‌యానికి గుర‌య్యారు. వెంట‌నే మ‌హిళలంతా గుమికూడా ఆమెకు డ్ర‌స్ వేశారు.

ప‌క్క‌నే ఉన్న పోలీసులు వ‌చ్చి ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కి తీసుకుపోయారు. అదే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న మ‌హిళ‌లు కొంద‌రు ఆమె డెబిట్ కార్డ్ తీసుకుపోయి మ‌నీ తీసుకువ‌చ్చి ఇవ్వ‌డంతో ఆమె శాంతించింది. దీంతో, పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇది సామాన్య జ‌నాల‌లో ఇంత‌టి విసుగుని పెంచుతుంద‌ని విమర్శిస్తుంటే, మ‌రోవైపు, ఆమెపై విరుచుకు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఇంత చిన్న‌విష‌యానికే అమ్మాయి అనే తేడా లేకుండా ఇలా బేర్ బాడీతో టాప్ లెస్‌గా మార‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మరికొంద‌రి వాద‌న మ‌రోలా ఉంది. ఆమె యువ‌తి కాద‌ని, ట్రాన్స్ జెండ‌ర్ అని అందుకే, ఇలా చేసింద‌ని చెబుతున్నారు.

 

Loading...

Leave a Reply

*