షాకింగ్ వీడియో.. యాక్సిడెంట్ త‌ర్వాత మ‌నిషి ఆత్మ గాల్లో..!

acceident

అస‌లు ఆత్మ ఉంటుందా.?? ఉండ‌దా..? ఉంటే అది మ‌నిషి రూపంలోనే ఉంటుందా..? లేక పాత పౌరాణిక సినిమాల‌లో చూపించిన విధంగా జ్ఞాన‌జ్యోతిలా ఉంటుందా? ఇదే ఇప్ప‌టికీ అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌. అస‌లు ఆత్మ అనేది లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు, భౌతిక‌వాదులు చెబుతుంటే.. ఆత్మ ఉంటుంద‌ని, ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. దానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు చెబుతారు. మ‌రెన్నో విశ్లేష‌ణ‌లు మ‌న ముందుంచుతారు. మ‌ర‌ణం శ‌రీరానికే కానీ, ఆత్మ‌కు కాదు అని కొంద‌రు వాదిస్తే.. అస‌లు ఆత్మ వ‌ట్టి బూట‌కం అంటారు మ‌రికొంద‌రు. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా.. వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెడితే.. ఆత్మ ఉంద‌ని ఓ వీడియో సాక్షిగా ప్రూవ్ అయింది. సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా బ‌య‌ట‌ప‌డింది.

ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదంలో సీసీ కెమెరాకు చిక్కిన ఫుటేజీ.. నెటిజన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి రెండురోజుల్లో సుమారు 7 లక్షలపైగా హిట్స్ వచ్చాయి. ఇప్ప‌టికీ అదే స్థాయిలో దీనిని వీక్షిస్తున్నారు.

రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ కారుని వేగంగా వస్తున్న టూ వీల‌ర్ బ‌లంగా ఢీ కొట్టింది. అంతే, స్కూట‌రిస్ట్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా… ఆ వ్య‌క్తిలో ఆత్మ లేచి అక్క‌డ నిల‌బ‌డిన‌ట్టుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోని చూసిన చాలా మంది ఆత్మ ఉందని.. దానికి ఇదే బ‌ల‌మైన సాక్ష్య‌మ‌ని బ‌లంగా వాదిస్తున్నారు. అంతేకాదు, వీడియో కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. దేవుడు, ఆత్మ ఉన్నాయ‌న‌డానికి ఇదే ప్ర‌బ‌ల నిద‌ర్శ‌న‌మ‌ని వీడియో నొక్కి మ‌రీ చూపిస్తున్నారు.

మ‌రోవైపు, ఇదంతా బూట‌క‌మ‌ని, మార్పింగ్ చేసిన వీడియో అని కౌంట‌రిస్తున్నారు. పోలీసు ఆత్మ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి అక్క‌డ నిల‌బ‌డ్డ‌ప్పుడు ఎలాంటి మార్పు లేద‌ని, ఇదంతా టెక్నిక‌ల్ మాయాజాల‌మ‌ని చెబుతున్నారు. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా.. వీడియో మాత్రం ఇప్పుడు యూ ట్యూబ్‌లో
హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Loading...

Leave a Reply

*