ఎన్టీఆర్ కి షాక్ త్రివిక్రమ్ తో మహేష్…

trivikram

హీరో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి క్లాసిక్ గా నిలిచిపోతే.. ఇంకోటి అట్టర్ ఫ్లాప్ అయింది. అంతే… అప్పట్నుంచి వాళ్లిద్దరూ సెట్స్ పై కలవడం మానేశారు. తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ను మరో ఫ్లాప్ తో పాడుచేసుకోవడం ఇష్టంలేక ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఖలేజా ఫ్లాప్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి మళ్లీ సినిమా చేయలేదు. అయితే ఇన్నాళ్లకు ఆ అవకాశం రానే వచ్చింది.

వచ్చే నెల నుంచి మహేష్-త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. అదేంటి… మురుగదాస్ సినిమా లైన్లో ఉండగానే… మరో సినిమా మహేష్ చేయడం అసంభవం కదా అనే డౌట్ రావొచ్చు. నిజమే.. మీ అనుమానం కరెక్టే. త్రివిక్రమ్ తో కలిసి మహేష్ చేయబోయేది సినిమా కాదు. ఓ యాడ్ షూట్ కోసం మహేష్-త్రివిక్రమ్ కలిశారు. ఓ ఆన్ లైన్ టికెటింగ్ కంపెనీ… ఎట్టకేలకు వీళ్లిద్దర్నీ ఇలా సెట్స్ పై కలిపింది.

నందని నర్సింగ్ హోం ఆడియో ఫంక్షన్ లో మహేష్-త్రివిక్రమ్ కలిసి సీరియస్ గా చర్చించుకున్నప్పుడే వాళ్ల కాంబోలో ఏదో రాబోతుందనే అనుమానం అందరికీ కలిగింది. అసలు స్టేజ్ పై ఏం జరుగుతోందనే విషయాన్ని కూడా మరిచిపోయి, ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు. అయితే అది సినిమా డిస్కషన్ కాదని, యాడ్ కోసం మాత్రమే చర్చించుకున్నారనే విషయం తాజాగా వెలుగులోకివచ్చింది.

Loading...

Leave a Reply

*