అమెజాన్‌లో అమ్ముతున్న ఆపిల్ ఉత్ప‌త్తుల్లో కొన్ని ఫేక్ అట‌!

amazon

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం… ఈ-టైల‌ర్ అమెజాన్‌… గుండుసూది నుంచి విమానం దాకా అన్ని ఆన్‌లైన్‌లో కొనుక్కోవ‌చ్చు… అమెజాన్‌లో వ‌స్తువులంటే క‌స్ట‌మ‌ర్ల‌కు భ‌ద్ర‌త‌, భ‌రోసా.. బ్రాండ్ విలువ ఉంటుంద‌ని భావిస్తారు… అయితే అలాంటి అమెజాన్‌లో అమ్మే వ‌స్తువుల‌న్నీ అస‌లివి కావుట‌.. కొన్ని ఫేక్‌వి కూడా ఉంటాయిట‌.. ఇప్పుడు ఈ వార్త క‌ల‌క‌లం రేపుతోంది.. అమెజాన్ క‌స్ట‌మ‌ర్ల‌లో క‌ల‌వ‌రం రేపుతోంది… సోష‌ల్ మీడియాలో కార్చిచ్చు ర‌గిలిస్తోంది….. అదికూడా వాల్డ్‌లో టాప్ బ్రాండ్ ఆపిల్ ఉత్ప‌త్తుల్లో కొన్నింటికి సంబంధించి అమెజాన్‌లో ఫేక్‌వి అమ్ముతున్నారుట‌… న‌కిలీవి అంట‌గ‌డుతున్నారుట‌…అమెజాన్‌లో అమ్ముడ‌వుతున్న ఆపిల్ యూఎస్‌బీ కేబుల్స్‌, ప‌వ‌ర్ అడాప్ట‌ర్లు న‌కిలీవ‌ని సాక్షాత్తూ ఆపిల్ కంపెనీయే ఆరోపించింది.. అమెజాన్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ప‌ది ర‌కాల ఆపిల్ ఉత్ప‌త్తుల్లో తొమ్మిది న‌కిలీవ‌ని ఆపిల్ కంపెనీయే బ‌ల్ల గుద్ది చెబుతోంది…

అమెజాన్‌కు ఉన్న బ్రాండ్ వాల్యూతో మొబైల్‌స్టార్ ఎల్ఎల్సీ కంపెనీ ఇలా వినియోగ‌దారుల‌ను మోసం చేస్తోంద‌ని ఆపిల్ ఆరోపించింది…. అమెజాన్‌లో అడ్డ‌గోలుగా న‌కిలీ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు జ‌రిగిపోతున్నాయ‌ని ఆపిల్ ఆగ్ర‌హిస్తోంది… ఈమేర‌కు మొబైల్‌స్టార్ ఎల్ఎల్సీపై కోర్టులో కేసు కూడా వేసింది… రెండు మిలియ‌న్ డాల‌ర్ల న‌ష్ట ప‌రిహారాన్ని కోరింది….. ఆన్‌లైన్ అమ్మ‌కాల దిగ్గ‌జం అమెజాన్ ఏంటి…. ఇలా ఫేక్ వ‌స్తువుల‌తో వినియోగ‌దారుల‌ను షేక్ చేయ‌డం ఏంటి… అది కూడా అత్యంత ప్ర‌ముఖ కంపెనీ ఆపిల్ ఉత్ప‌త్తుల పేరుతో న‌కిలీ వ‌స్తువులు అమ్మేస్తుంటే అమెజాన్ ఇన్నాళ్లు ఏం చేస్తూ కూర్చుంది… క‌ళ్లు మూసుకుని ఉందా అని క‌స్ట‌మ‌ర్లు కోపంగా అడుగుతున్నారు..

ఇన్నాళ్లు స్మార్ట్ బ్రాండ్ల పేరుతో తాము కొన్న వ‌స్తువులు స్మార్ట్‌వో కాదో అర్థం కావ‌డం లేద‌ని, అవి కూడా ఫేక్ అని అనుమానం వ‌స్తోంద‌ని వినియోగదారులు వాపోతున్నారు.. ఈ ఫేక్ వ‌స్తువుల బాగోతం బ‌య‌ట‌ప‌డ‌డంతో అమెజాన్‌కు షాక్ త‌గిలి బ్రేక్ అవ‌క త‌ప్ప‌దంటున్నారు మార్కెట్ నిపుణులు.

Loading...

Leave a Reply

*