భార్య‌కు అమీర్‌ఖాన్ విడాకులు.. స‌న్నీలియోన్‌తో త్వ‌ర‌లోనే పెళ్లి..?

untitled-15

బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే వార్తను చ‌క్క‌ర్లు కొట్టిస్తున్నాడు ఓ క్రిటిక్‌. రీసెంట్‌గా పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపావ‌ళి రోజున అమీర్‌ఖాన్‌ని ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసింది. దీనిని ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్‌, స‌న్నీలియోన్ అంటే విప‌రీతంగా ద్వేషించే క‌మాల్ ఆర్ ఖాన్‌..ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌జ‌నీకాంత్ వంటి సూప‌ర్‌స్టార్‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన విమ‌ర్శ‌కుడు..స‌న్నీలియోన్ అమీర్ ఇంటికి వెళ్లిన టైమ్‌లో.. ప‌క్క‌న ఆమె భ‌ర్త డానియ‌ల్ కూడా ఉన్నాడు. అయినా, క‌మాల్ ఆర్ ఖాన్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న సంచ‌ల‌నం చేసి క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు.

ఎప్పుడూ వివాదాల‌తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసే ఈ క్రిటిక్‌… ఈసారి అమీర్ ఖాన్‌, స‌న్నీలియోన్ పెళ్లి చేసుకుంటారంటూ హ‌డావిడి చేస్తున్నాడు. స‌న్నీలియోన్ వంటి న‌టితో దీపావ‌ళి జ‌రుపుకోవ‌డానికి అమీర్ ఖాన్‌కి సిగ్గులేదంటూ విరుచుకుపడుతున్నాడు. జ‌నాలు అత‌ని సినిమాలు చూడ‌కూడ‌దు. కిర‌ణ్ రావుకు అమీర్ విడాకులు ఇచ్చి, స‌న్నీని పెళ్లి చేసుకుంటే.. ఆమె షాక్ అవుతుందో లేదో కానీ, నేన‌యితే షాక్ అవుతాను. అంటూ కామెంట్ చేశాడు.. అక్క‌డితో ఆగ‌లేదు… సిగ్గు లేని మ‌నిషి ఏదైనా చేస్తాడ‌ని ఫైర్ అవుతున్నాడు క‌మాల్ ఆర్ ఖాన్‌.

Loading...

Leave a Reply

*