కొత్త 2వేల నోటుపై అదిరిపోయే ట్విస్ట్‌..నానో చిప్ కాదు.. ఇంటాగ్లియో పెట్టాం….!

new-2000-notes

కొత్త 2వేల రూపాయ‌ల నోటులో నానో చిప్ పెట్టార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో, ఏది ఒరిజిన‌లో, ఏది కాదో ఈజీగా చెప్పేయొచ్చ‌ని, ప్ర‌తి నోటు ఎక్క‌డ స‌ర్క్యులేట్ అయినా ఈజీగా తెలుసుకోవ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇదంతా కొత్త 2వేల నోటు మార్కెట్‌లోకి రాక‌ముందు సంగ‌తి. అదంతా ఒట్టిదే అనే ఆర్‌బీఐ అధికారులు కూడా తేల్చిపారేశారు. దీంతో, ఆ వార్త‌కు బ్రేక్ ప‌డింది.తాజా ట్విస్ట్ ఏంటంటే.. నయా 2వేల రూపాయ‌ల నోటులో నానో చిప్ లాంటి ప‌క‌డ్బందీ ఫీచ‌ర్ లేక‌పోయినా.. ఇంటాగ్లియో అనే కొత్త ఫీచ‌ర్‌ని ఏర్పాటు చేశామ‌ని చెబుతున్నారు అధికారులు.

ఈ సెక్యూరిటీ ఫీచ‌ర్‌పై ఇప్ప‌టిదాకా నోరు మెద‌ప‌ని ఉన్న‌తాధికారులు తాజాగా ఆ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు. ఇంటాగ్లియో ఫీచ‌ర్‌తో ఫేక్‌, ఒరిజిన‌ల్ మ‌ధ్య తేడాని ఈజీగా ప‌ట్టేయ‌వ‌చ్చని చెబుతున్నారు.ఇంత‌కీ ఈ ఇంటాగ్లియో ఫీచ‌ర్ ఏంట‌నేగా మీ డౌట్‌. ఇందులో భాగంగా నోటులోకి ఒక‌రక‌మైన డిజైన్‌ను చొప్పిస్తారు. దీంతో, అస‌లు నోటు ఏదో న‌కిలీ ఏదో సింపుల్‌గా చెప్పేసేయొచ్చు. ఒక వ‌స్త్రాన్ని తీసుకొని నోటుపై రుద్దాలి. అలా రుద్దిన‌ప్పుడు ట‌ర్బో ఎల‌క్ట్రిక్ ఎఫెక్ట్‌తో షాక్ వ‌స్తుంది. నోటులో ఉన్న ఇంకు వ‌స్త్రంలోకి బ‌దిలీ కావ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది.

ఇది చిన్న షాక్‌లా ఉంటుంది. ఇలా షాక్ త‌గిలిదే అది ఒరిజిన‌ల్ అని, లేదంటే న‌కిలీ అని గుర్తు ప‌ట్ట‌వ‌చ్చని అధికారులు చెబుతున్నారు. ఇది హై సెక్యూరిటీ ఫీచ‌ర్ అట‌. దీనిని కాపీ కొట్ట‌డం అంత ఈజీ కాదంటున్నారు ఉన్న‌తాధికారులు. మీకు మీ కొత్త నోటుపై ఇలాంటి డౌట్స్ ఏమ‌యినా ఉంటే వెంట‌నే ఓ వ‌స్త్రం తీసుకొని రుద్దండి. షాక్ కొడితే.. అది ఒరిజిన‌ల్ లేదంటే.. నిజంగానే షాక్ కొడుతుంది. ఫేక్ అని. ఇలా రెండు ర‌కాల ట్విస్ట్‌ల‌లో మీకు ఏది దొరుకుతుందో చూడండి.

Loading...

Leave a Reply

*