ఇజం మార్నింగ్ షో ఫ‌స్ట్‌ టాక్‌.. సినిమా ఎలా ఉందంటే..!

untitled-4

న‌టీన‌టులు.. క‌ల్యాణ్‌రామ్‌, ఆదితి ఆర్య‌, జ‌గ‌ప‌తి బాబు, త‌నికెళ్ల భ‌రణి, గొల్ల‌పూడి మారుతీరావు..
మ్యూజిక్‌.. అనూప్ రూబేన్స్
ఎడిటింగ్‌.. జునైద్ సిద్దిఖి
సినిమాటోగ్ర‌ఫీ.. ముఖేష్‌
నిర్మాత‌.. క‌ల్యాణ్‌రామ్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం.. పూరి జ‌గ‌న్నాధ్‌

క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఓ డిఫ‌రెంట్ మూవీ ఇజం. పూరి జ‌గ‌న్నాధ్ వంటి బ‌డా డైరెక్ట‌ర్‌తో మూవీ చెయ్య‌డం ఇదే మొద‌టిసారి. ఎప్పుడూ మొనాట‌న‌స్‌గా క‌నిపించే క‌ల్యాణ్‌రామ్‌.. ఇజం కోసం మేకోవ‌ర్ మార్చాడు. న‌యా అవ‌తార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీ, సూప‌ర్ హీరో రోల్‌తోపాటు వైవిధ్య‌మైన‌ హెయిర్ స్ట‌యిల్‌, బాడీ లాంగ్వేజ్‌లో ప‌క్కా అర్బ‌న్ ట్రెండ్‌ని ఫాలో అయ్యాడు. దీంతో, సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. బాలీవుడ్ భామ ఆదితి ఇజంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. క‌థ‌, క‌థ‌నంతోపాటు మాట‌లు కూడా పూరినే స‌మ‌కూర్చారు. జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది ఇజం. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఇజం ఫ‌స్ట్ షో టాక్ ఇలా ఉంది.

క‌ల్యాణ్ రామ్ (స‌త్య మార్తాండ్‌) ఓ న్యూస్ చానెల్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ప‌క్కా ఐడియాలజీతో క‌నిపించే సిన్సియ‌ర్ పాత్రికేయుడు. ఆయ‌న‌కు జగ‌ప‌తి బాబు (జావేద్ ఖాన్) మంచి ఫ్రెండ్‌. స‌త్య‌కి జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌తో అవినీతి విశ్వ‌రూపం ఏంటో తెలిసి వ‌స్తుంది. ఆయ‌న చెయ్య‌ని త‌ప్పుకి అత‌ను బాధితుడు అవుతాడు. దీంతో, అవినీతి అరిక‌ట్టాల‌నుకుంటాడు. ఇటు, సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తూనే.. అటు మాస్క్ కేర‌క్ట‌ర్‌తో అవినీతిని బ‌య‌ట పెడుతుంటాడు. క‌థ‌లో కొత్త ట్విస్ట్‌తో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది మూవీ. జ‌ర్న‌లిజం గొప్ప‌త‌నంతోపాటు, ఆ వృత్తిలోని లొసుగుల‌ని కూడా ఎత్తి చూపాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ అవినీతి మీద. దేశంలో మూలుగుతున్న వేల కోట్ల న‌ల్ల‌ధ‌నంపై చేసే ఆప‌రేష‌న్‌లో క‌ల్యాణ్‌రామ్ స‌క్సెస్ అయ్యాడా? లేదా? అనేది మిగ‌తా స్టోరీ..

ఇజం ఫ‌స్ట్ హాఫ్ మొత్తం స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డుస్తుంది. హీరో ల‌వ్ ట్రాక్‌తోపాటు ఎల‌క్ర్టానిక్ మీడియాలో జ‌రిగే సీన్స్ అన్నింటిని పూస‌గుచ్చిన‌ట్లు చూపించాడు పూరి. రొమాంటిక్ సీన్స్‌లో త‌న మార్క్ ల‌వ్ సీన్‌లతో బాగా ఎంట‌ర్‌ట‌యిన్ చేశాడు. పూరి బ్రాండ్ హీరో క‌ల్యాణ్‌రామ్‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపించాడ‌ని చెప్పుకుంటున్నారు. అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్‌లు కెమెరామెన్ గంగ‌తో రాంబాబుని గుర్తు చేస్తుంటాయ‌ట‌. ఇటు, కిక్, శివాజీ చిత్రాల‌ను కూడా రిక‌లెక్ట్ అవుతుంటాయ‌ట సినిమా చూస్తుంటే… ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు సినిమా బావుంద‌ని, జాలీగా న‌డిచిపోతుంద‌ని స‌మాచారం. ముఖ్యంగా క‌ల్యాణ్‌రామ్ మేకోవ‌ర్‌, ఆదితి ఆర్య గ్లామ‌ర్ సినిమాకి బాగా ఫెచ్చింగ్ అవుతుంద‌ని చెప్పుకుంటున్నారు. ఇటు, జావేద్ ఖాన్‌గా జ‌గ‌ప‌తిబాబు రోల్ కూడా ఆక‌ట్టుకుంద‌ట‌.

ఇక‌, సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి సినిమా అస‌లు క‌థ‌లోకి ఎంట‌ర్ అవుతుంది. క‌థేంటో ఫ‌స్ట్ హాఫ్ ఇంట‌ర్‌వెల్‌లోనే తెలిసిపోతుందని, దీంతో, లాగ్ ఉన్న‌ట్లు అనిపించినా.. పూరి జ‌గ‌న్నాథ్‌.. త‌న మేకింగ్ స్ట‌యిల్‌తో దానిని క‌వ‌ర్ చేశాడ‌ని స‌మాచారం. ఇటు, వికీ లీక్స్, ప‌నామా లీక్స్ వంటి సీరియ‌స్ స‌బ్జెక్ట్ అవ‌డంతోపాటు, లుచ్చాలు, ల‌ఫంగాలు ఉండే సొసైటీపై త‌న మార్క్ సెటైర్‌లు వేశాడ‌ని, అదే సెకండాఫ్‌కి ప్రాణం పోస్తుంద‌నే కామెంట్స్ వ‌స్తున్నాయి. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది ఓ డిఫ‌రెంట్ మూవీ అంటున్నారు. సినిమాకి మంచి మార్కులు ప‌డుతున్నాయి. పూరి జ‌గ‌న్నాధ్‌.. స్క్రిప్ట్‌పై మ‌రింత వ‌ర్క్ చేసి ఉంటే సినిమా మ‌రో రేంజ్‌కి వెళ్లేద‌ని చెప్పుకుంటున్నారు. టోట‌ల్‌గా సినిమాకి మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఫ‌స్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది ఇజం.

Loading...

Leave a Reply

*