జ‌గ‌న్‌కు అంత ద‌మ్ముందా?

jagan-mohan-reddy

హోదా కోసం ఎంత‌కైనా తెగిస్తామ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆయ‌న పార్టీలోనే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అవ‌స‌ర‌మైతే త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తానంటూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న వైసీపీలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందా అన్న అనుమానం వ‌స్తోంది. అస‌లు జ‌గ‌న్ త‌న ఎంపీల‌పై అలా ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించ‌గ‌ల‌రా అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మవుతున్నాయి. జ‌గ‌న్‌పై త‌ర‌చూ వ‌చ్చే ఒక విమ‌ర్శ ఆయ‌న ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుని వాటిని పార్టీ నేత‌ల‌పై రుద్దుతార‌ని. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారు చేసే ప్ర‌ధాన విమ‌ర్శ ఇదే.

అలాంటి విమ‌ర్శ ఎదుర్కొంటున్న జ‌గ‌న్ తాజాగా రాజీనామాల నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో వైసీపీ నేత‌ల‌కే షాక్ క‌లిగించింద‌ని స‌మాచారం. స‌రే ఇదంతా ప‌క్క‌న పెట్టినా… జ‌గ‌న్ చెప్ప‌గానే ఆయ‌న పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా అన్న‌దే ఇప్పుడు కీలకం. గ‌త ఎన్నిక‌ల‌లో కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి గెలిచిన ఎంపీలు జ‌గ‌న్ చెప్ప‌గానే రాజీనామా చేసేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ధైర్యం చేస్తారా అన్న‌ది కూడా అనుమాన‌మే. ఇప్ప‌టికే పార్టీ మారి టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. రోజుకొక‌రు.. అదీ జ‌గ‌న్‌కు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉండే వారు సైతం పార్టీ వీడి వెళ్లిపోతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంపీల‌తో రాజీనామాలు చేయించ‌గ‌లిగే ద‌మ్ము, సామ‌ర్ధ్యం జ‌గ‌న్‌కు ఉందా అనే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలోనూ టీడీపీ ప్ర‌భుత్వంపై, చంద్ర‌బాబుపై జ‌గ‌న్ అనేక పోరాటాల‌ను ప్రారంభించారు. అవి ప్రారంభించ‌డ‌మైతే అంద‌రికీ తెలిసింది కానీ అవి ఎక్క‌డ కొన‌సాగాయ‌న్న‌దానిపై వైసీపీ నేత‌లే పెద‌వి విరుస్తున్నారు. జ‌గ‌న్ తాజా ఆందోళ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మం ఎక్క‌డ జ‌రుగుతుందో.. ఎలా జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు జ‌గ‌న్ చెప్పిన ద‌శ‌ల‌వారీ హోదా పోరు… ఎంపీల రాజీనామా ఎంత‌వ‌ర‌కూ కార్య‌రూపం దాలుస్తుందో.

Loading...

Leave a Reply

*