ఒకే చోటుకు చేరుతున్న ఇద్దరు బడా స్టార్లు

two-super-stars

ఓ వైపు చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్ తన కెరీర్ లోనే అతి భారీ బడ్జెట్ సినిమా రోబో 2.0తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఓ అరుదైన లొకేషన్ లో ఈ రెండు సినిమాలు కలుస్తున్నాయి. ఆ అద్భుతమైన ప్లేస్ లో చిరంజీవి, రజనీకాంత్ కలుసుకోబోతున్నారు. అదే ఉక్రెయిన్ దేశం.

ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో తన 150వ సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించాలని చిరు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తో కలిసి ఐటెంసాంగ్ కోసం చిందేస్తున్న చిరు.. ఉక్రెయిన్ అందాల మధ్య హీరోయిన్ కాజల్ తో కలిసి ఓ సాంగ్ లో స్టెప్పులేయాలని డిసైడ్ అయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. వచ్చేనెల నుంచి ఉక్రెయిన్ టూర్ ఉంటుంది.

అటు రజనీకాంత్ కూడా ఉక్రెయిన్ బాట పట్టాడు. దేశంలోని అత్యంత అరుదైన టన్నెల్ ఆఫ్ లవ్ అనే ప్రాంతంలో తన సినిమాకు సంబంధించిన ఓ పాటను తీయాలని సూపర్ స్టార్ ఫిక్స్ అయ్యాడు. నిజానికి తన ప్రతి సినిమాలో ఓ అందమైన లొకేషన్ ను చూపించడం శంకర్ కు అలవాటు. అందుకే రోబో 2.0 కోసం ఉక్రెయిన్ లోని టన్నెల్ ఆఫ్ లవ్ అనే స్పాట్ ను ఫిక్స్ చేశాడు.

Loading...

Leave a Reply

*