ఈ ముగ్గురి పై జగన్ , బాబు కన్ను

jagan-and-babu

తెలుగు చిత్ర‌సీమ‌లో స‌మంత‌.. న‌మ్ర‌త సూప‌ర్‌హిట్ హీరోయిన్స్‌. ఇక మంచు ల‌క్ష్మి తెలుగు సినిమా… టీవీ ప్రేక్ష‌కుల్లో తిరుగులేని పేరుంది. అలాంటి ఈ ముగ్గురు రాజ‌కీయాల్లోకి వ‌స్తే…. వారిని త‌మ పార్టీల్లోకి రావాలంటే త‌మ పార్టీల్లోకి రావాలంటూ నాయ‌కులు పోటీలు ప‌డ‌తారేమో. ఏదో స‌ర‌దాకి అంటున్న‌ది కాదు. నిజంగానే ఏపీలోని ముఖ్య‌నేత‌లైన సీఎం చంద్ర‌బాబు, సీఎం కావాల‌నుకుంటున్న జ‌గ‌న్ ఇద్ద‌రూ మ‌దిలోనూ ఇదే ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సామాజిక కార్య‌క్ర‌మాల్లో స‌మంత‌కు పెట్టింది పేరు. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా… స‌మంత హృద‌యం ద్ర‌వించి పోతుంది. తన స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా రంగంలోకి దిగుతుంది.

అలాగే, మంచు ల‌క్ష్మికూడా త‌నకున్న ప్ర‌జాద‌ర‌ణ‌తో ప్ర‌జాప‌యోగ టీవీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే సామాజిక స్పృహ క‌లిగిన వీళ్లంద‌రిని త‌మ వైపు ఆక‌ర్షించ‌గ‌లిగితే ఇక రాష్ట్రంలో త‌మ‌కు తిరుగుండ‌ద‌ని టీడీపీ, వైసీపీ అధినేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. సినీ రంగం నుంచి వ‌చ్చిన క‌థానాయ‌కి రోజా మాత్ర‌మే ఇప్పుడు యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. టీడీపీ ద్వారానేరాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన రోజా ఇప్పుడు జ‌గ‌న్‌తో క‌లిసి  రాజ‌కీయ ప్ర‌యాణం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు పాలిటిక్స్‌కు మ‌రింత సినిమా క‌ల‌ర్ తెచ్చేందుకు అధికార ప్ర‌తిప‌క్ష నేత‌లు పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం.

Loading...

Leave a Reply

*