బాబు టీచ‌ర్‌… ఎమ్మెల్యేలే స్టూడెంట్స్‌

untitled-131

టీడీపీ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం సీరియ‌స్‌గా సాగుతోంది. రాజ‌కీయ అంశాల కంటే ఈ శిక్ష‌ణ‌లో టెక్నాల‌జీకి సంబంధించిన అంశాల‌పైనే ఎమ్మెల్యేల‌కు త‌ర్ఫీదునిస్తున్నారు. దీనిని టీడీపీ వ‌ర్క్‌షాప్ అనే కంటే… టీడీపీ ఎమ్మెల్యేల కంప్యూట‌ర్ క్లాసులు అన‌డం క‌రెక్టేమో. తొలిరోజు రాజ‌కీయ ఉప‌న్యాసాల‌తో శిక్ష‌ణ‌ను ప్రారంభించిన చంద్ర‌బాబు రెండో రోజు పూర్తిగా ట్రైనింగ్ అంతా కంప్యూట‌ర్‌… సెల్‌ఫోన్ యాప్‌ల వినియోగంపైనే దృష్టి సారించారు. ఎమ్మెల్యేలంతా బుద్దిగా కంప్యూట‌ర్ల‌లో త‌ల‌దూర్చి… యూనివ‌ర్సిటీ విద్యార్థులు, నిపుణులు చెబుతున్న విష‌యాల‌ను అవ‌లోక‌నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. వీరు వారూ అని తేడా లేకుండా.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కూ అంద‌రూ క్లాస్ రూంలో… కాదు కాదు కంప్యూట‌ర్ ల్యాబ్‌లో సిస్ట‌మ్స్ ముందు కూర్చుని మౌస్‌ను క‌దిలిస్తూ క‌నిపించారు.

న‌వ్యాంధ్ర పాల‌న‌లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్న చంద్ర‌బాబు అందులో ఎమ్మెల్యేలంద‌రికీ పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. తొలిరోజు ఎమ్మెల్యేలు ఓట్లు తెస్తేనే మ‌న ప్ర‌భుత్వం ఉంటుంద‌ని క్లాసు పీకిన చంద్ర‌బాబు రెండో రోజు వారికి కంప్యూట‌ర్ శిక్ష‌ణ ఇప్పించ‌డం ప‌ర‌స్ప‌ర వైరుధ్య అంశాలుగా పేర్కొంటున్న వారూ కొంద‌రున్నారు. చంద్ర‌బాబు చెప్పే ప్ర‌కారం జ‌నం ఓట్లు గంప‌గుత్త‌గా ప‌డాలంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్యక్ర‌మాల ఫ‌లాలు చిట్ట‌చివ‌రి ల‌బ్ధిదారుకు కూడా చేరాలి. అలా చేరిన‌ట్లు ప్ర‌జ‌ల‌కు తెలియాలి. గ్రామీణ భార‌తంలో నిర‌క్ష‌రాస్యులు ఎక్కువ‌గా ఉండే రాష్ట్రంలో కంప్యూట‌ర్లు తీసుకెళ్లి జ‌నానికి ఎలా తాము చేస్తున్న ప‌నుల‌ను వివ‌రిస్తారో మ‌రి ఈ నేత‌లు.

Loading...

Leave a Reply

*