ఐడియా బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ డేటా..!

idea-bumper-offer-for-1-rupee-4g-plan

జియో ఎంట్రీతో దేశ టెలికాం ముఖ‌చిత్రం మారిపోతోంది. డేటాగిరి మొద‌ల‌యింది. నిన్న‌మొన్న‌టిదాకా క‌స్ట‌మ‌ర్లు కంపెనీల బాదుడుతో విసిగిపోయారు. ఏ టెలికాం కంపెనీ పోర్ట్ కొడ‌దామ‌న్నా బిల్లు వాచిపోతుందేమోన‌న్న భ‌యం వెంటాడుతుండేది. ఇప్పుడు సీన్ మారింది. నిన్న‌మొన్న‌టిదాకా టారిఫ్ ప్లాన్‌ల విష‌యంలో త‌న‌కంటూ ఓన్ ప‌ద్ధ‌తిని అనుస‌రించిన ఐడియా కూడా తాజాగా దిగి వ‌స్తోంది. ఇప్పటిదాకా డేటా ప్లాన్‌ల‌ను స‌వ‌రించి క‌స్ట‌మ‌ర్ల‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన ఐడియా.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది. ఒక్క రూపాయికే అన్‌లిమిటెడ్ 4జీ డేటా ప్యాకేజ్‌ని ప్ర‌క‌టించింది.. దానిని ఎలా పొందాలంటే…

మీ ద‌గ్గ‌ర ఐడియా 4జీ సిమ్‌తో పాటు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి. ఇక, మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్ త‌ప్ప‌నిస‌రిగా ఉండేలా చూసుకోవాలి. మీ 4 జీ హ్యాండ్ సెట్ నుంచి 411కి డ‌య‌ల్ చెయ్యాలి. ఆ త‌ర్వాత అందులో చెప్పే స‌మాధానాన్ని అనుస‌రించాలి. అందులో మీకు 4జీ డేటాకి సంబంధించిన మేట‌ర్ ఉంటుంది. దానిని యాక్టివేట్ చేసుకోవాలి. అది యాక్టివేట్ అయిన త‌ర్వాత మీకు మెస్సేజ్ అందుతుంది. అయితే, అది మీకు గంట మాత్ర‌మే ప‌నిచేస్తుంది. గంట త‌ర్వాత అది ప‌నిచెయ్య‌దు.

ఈ ఆఫ‌ర్‌లో మీరు ఐడియా ఇచ్చే సూప‌ర్‌ఫాస్ట్ డేటాను గంట‌వ‌ర‌కు విప‌రీతంగా వాడుకోవ‌చ్చు. ఈ వ‌న్ అవ‌ర్‌లోనే 4 జీబీ నుంచి 5 జీబీ డేటా పొంద‌వ‌చ్చు. అయితే, ఇక్క‌డ కొన్ని కండిష‌న్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే.. మీరు ఫాలో అవుతున్న పాత డేటా ప్యాకేజ్ ఆగిపోతుంది. కానీ, ఈ ఆఫ‌ర్‌ను మీరు కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే పొంద‌వ‌చ్చు. ఆ త‌ర్వాత అది అప్లై కాదు. మ‌ళ్లీ కొత్త నెంబ‌ర్ తీసుకొని మ‌రో మూడు సార్లు ఈ రూపాయికే 4జీ అన్‌లిమిటెడ్ డేటాను పొంద‌వ‌చ్చు.

Loading...

Leave a Reply

*