బాబు… వెంక‌య్య‌ల‌కు 14 ఆర్థిక సంఘం షాక్!

babu-and-venkaiah

ఏపీ సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌ల‌కు 14వ ఆర్థిక సంఘం చైర్మ‌న్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌ద్దంటూ ఆర్థిక సంఘం చెప్పింద‌ని అందుకే తాము చేతులు క‌ట్టేసుకోవాల్సి వ‌చ్చింద‌ని వెంక‌య్య‌, బాబు ఊద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 14వ ఆర్థిక సంఘం చైర్మ‌న్‌గా ప‌నిచేసిన వైవీ రెడ్డి స్వ‌యంగా అదంతా అబద్ధ‌మ‌ని తేల్చి చెప్పారు. అస‌లు ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు. అలాగే, ఆర్థిక సంఘం సిఫార‌సులు పాటించే అంశం ప్ర‌భుత్వ విచ‌క్ష‌ణేన‌ని అందులో క‌చ్చితంగా పాటించాల‌న్న నిబంధ‌నేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఏపీకీ హోదా తానే డిమాండ్ చేశాన‌ని అయితే, ఆర్థిక సంఘమే త‌మ చేతులు క‌ట్టేసిందంటూ వెంక‌య్య చేస్తున్న ప్ర‌చారం ఒట్టిదేన‌ని తేలిపోయింది. అంటే హోదా ఇవ్వ‌ద్ద‌ని ఉన్నా అంత‌కుమించి ప్యాకేజీ ఇచ్చామంటూ ఊరూరా స‌న్మ‌నానాలు చేయించుకుంటున్న వెంకయ్య ఇప్పుడేం బుకాయిస్తారో మ‌రి. ఈ విష‌యం ఎప్ప‌టికైనా బ‌య‌ట‌కొస్తుంద‌నే ఏమో తిరుప‌తిలో చేయించుకున్న స‌న్మానంలో వెంక‌య్య మాట మార్చారు. ఏపీకి ఇస్తే తొమ్మిది రాష్ట్రాలు అడుగుతాయ‌ని అందుకే ఇవ్వ‌డం లేద‌ని కొత్త సంగ‌తి చెప్పారు.

Loading...

Leave a Reply

*