జ‌గ‌న్‌కు షాక్‌.. వ్య‌తిరేకిస్తున్న ఎంపీలు…!

jagan

ప్ర‌త్యేక హోదా పోరాటంలో జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్న కార్యాచ‌ర‌ణ‌కు… ఆయ‌న పార్టీ ఎంపీల ఆలోచ‌న‌కు భిన్నాభిప్రాయాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. హోదా విష‌యంలో ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. రాబోయే అన్ని పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను అడ్డుకుంటామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల వ‌ర‌కూ ఈ ఒత్తిడి కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. అప్ప‌టికీ కేంద్రం దిగిరాకుంటే… రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌కుంటే… అప్పుడు తుది పోరుకు సిద్ధ‌మ‌వుతామ‌ని తెలిపారు. అందుకు డెడ్‌లైన్ కూడా పెట్టారు. వ‌చ్చే ఏడాది మే 15 వ‌ర‌కూ వేచి చూస్తామ‌ని అప్ప‌టికీ మోడీ ప్ర‌భుత్వం దిగి రాకుంటే… త‌మ ఎంపీలంతా రాజీనామాలు చేస్తార‌ని జ‌గ‌న్ నాలుగు రోజుల క్రితం ప్ర‌క‌టించారు.

ఎంపీల‌తో స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ ఈ సంగ‌తి వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత మాట్లాడిన బుట్టా రేణుక స‌హా మరికొంద‌రు వైసీపీ ఎంపీలు తాము ప‌ద‌వులు వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌మేన‌ని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ ఎంపీల స్వ‌రాల్లో మార్పు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు రీసెంట్‌గా ఢిల్లీలో వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజమోహ‌న్ రెడ్డి వ్య‌క్తం చేసిన స్పంద‌నే కార‌ణం. ఢిల్లీలో విలేక‌రులతో మేక‌పాటి మాట్లాడుతుండ‌గా కొంద‌రు విలేక‌రులు రాజీనామాల అంశాన్ని ప్ర‌స్తావించారు. దాన్ని లైట్‌గా తీసుకున్న మేక‌పాటి రాజీనామాల గురించి ఇప్పుడే ఆలోచించ‌లేదంటూ మాట దాటేశారు. జ‌గ‌న్ వెరీ సీరియ‌స్‌గా రాజీనామాలు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పోరాడ‌తామ‌ని చెబుతుంటే ఆ పార్టీ ఎంపీ మేక‌పాటి దాన్ని లైట్‌గా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Loading...

Leave a Reply

*