ద‌స‌రాకు మ‌రిన్ని వికెట్లు కోల్పోనున్న జ‌గ‌న్‌

jagan

జ‌గ‌న్‌కు ఈ ద‌స‌రా పెద్ద షాక్ ఇచ్చేట్లే ఉంది. టీడీపీ ఆక‌ర్ష్ వ‌ల‌లో ఇప్ప‌టికే చాలా మంది ఎమ్మెల్యేలు ప‌డిపోవ‌డంతో ఉన్న‌వారితోనే జ‌గ‌న్ త‌న కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు. రాబోయే విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినాన మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే పార్టీ మారిన జ్యోతుల‌, భూమా త‌దిత‌రుల‌కు ఇదే ద‌స‌రాకు జ‌రిగే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రిప‌ద‌వులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అదే జ‌రిగితే విప‌క్ష పార్టీ నుంచి వ‌చ్చిన వారికి అధికార‌పార్టీలో స‌రైన గౌర‌వ‌మే ల‌భిస్తుంద‌న్న భ‌రోసా ఇత‌ర విప‌క్ష ఎమ్మెల్యేల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అంటే పార్టీ మారాలా వ‌ద్దా అని ఊగిస‌లాడే వారు కూడా ఇక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

దీనికి తోడు డీ లిమిటేష‌న్ పూర్త‌యి ఒక్కో ఎంపీ స్థానంలో మ‌రో రెండు కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఆ ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని త‌న‌కు కేంద్రం భ‌రోసా ఇచ్చింద‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. అంటే ఈ పెరిగే నియోజ‌క‌వ‌ర్గాల‌తో పార్టీ మారిన నేత‌ల‌కు సీటు పోతుంద‌న్న భ‌య‌మూ ఉండ‌దు. అలాగే, టీడీపీలోని నేత‌ల‌తో త‌మ‌కు ఇబ్బందులుంటాయ‌న్న ఆందోళ‌నా ఉండ‌దు. కాబ‌ట్టి జ‌గ‌న్‌ను వీడి చంద్ర‌బాబును చేరే విష‌యంలో ఇక వాళ్లు నిర్భీతిగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల క‌థ‌నం. ఇదే జ‌రిగితే, హోదా ఉద్య‌మం పేరుతో జ‌నాల్లోకి వెళ్లాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌కు మరో షాక్ త‌గిలిన‌ట్లే.

Loading...

Leave a Reply

*