సీబీఐ కేసులో వైసీపీ నేత‌!

untitled-2

వైసీపీ నేత‌ల‌కు కాలం క‌లిసి వ‌స్తున్న‌ట్లు లేదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అధికార టీడీపీ నేత‌లు ప్ర‌తి విష‌యానికి జ‌గ‌న్ కోర్టు కేసుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన బాలశౌరిపై సీబీఐ కేసు న‌మోదైంది. ఆయ‌న ఎంపీగా ఉన్న స‌మ‌యంలో బినామీల ద్వారా భూములు కొన్న‌ట్లు సీబీఐ అభియోగాలు మోపిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి ఒక‌రు ప‌ద‌కొండున్న‌ర ఎక‌రాల భూమిని కొనుగోలు చేయ‌డంతో ఆయ‌న‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది.

ద‌ర్యాప్తులో ఆ వ్య‌క్తి తాను కొన్న భూమి త‌న‌ది కాద‌ని అప్పటి ఎంపీ బాల‌శౌరి కోరిక మేర‌కు తాను మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండి భూమిని కొన్నాన‌ని సీబీఐ అధికారుల‌కు చెప్పారు. దాంతో తీగ‌లాగిన సీబీఐ అధికారులకు బాల‌శౌరి ఖాతాల నుంచి కొట్ల రూపాయ‌లు స‌ద‌రు ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి బ్యాంకు ఖాతాల్లోకి వ‌చ్చి ప‌డిన‌ట్లు తెలిసింది. ఆధార స‌హితంగా అన్ని దొర‌క‌డంతో తాము అరెస్టు చేసిన వ్య‌క్తే నేరుగా తాను బాల‌శౌరి బినామీ అని చెప్ప‌డంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు వైసీపీ నేతపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని సీబీఐ అధికారి ఒక‌రు ధ్రువీక‌రించారు. మ‌రో రెండు వారాల త‌ర్వాత బాల‌శౌరీని విచారించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*