కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీ గెలుపు

ysrcp

కృష్ణా జిల్లాలో టీడీపీని ఖంగు తినిపించింది వైసీపీ….. సైకిల్ సైన్యానికి కంచుకోట అయిన కృష్ణా జిల్లాలోనే ఎల్లోబ్రిగేడ్‌కి కాజా తినిపించింది వైఎస్సార్సీ… గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 16 అసెంబ్లీ సీట్ల‌లో 10 సీట్లు టీడీపీ గెలిస్తే మిత్ర‌ప‌క్షం బీజేపీ ఒక‌టి గెల్చుకుంది… వైఎస్సార్సీ 5 సీట్లు గెల్చుకుంది… 2 ఎంపీ సీట్లు సైకిల్ ఖాతాలోనే ప‌డ్డాయి… అలాంటి టీడీపీ కంచుకోట‌ను ఇప్పుడు వైఎస్సార్సీ బ‌ద్ద‌లు కొట్టింది… 2014 ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారిగా కృష్ణా జిల్లాలో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది వైఎస్సార్సీ…. ఒక్క ఓటు తేడాతో టీడీపీకి పోటు పొడిచింది జ‌గ‌న్ పార్టీ… ఒక్క ఓటుతో ఒకే ఒక్క వేటుతో పెడ‌న మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి వైఎస్సార్సీ కైవ‌స‌మైంది… టీడీపీకి చెందిన కౌన్సిల‌ర్ స్ర‌వంతి….

వైఎస్సార్సీ చైర్మ‌న్ అభ్య‌ర్థి బండారు ఆనంద్ ప్ర‌సాద్‌కు అనుకూలంగా ఓటు వేశారు… దీంతో చైర్మ‌న్ పీఠ వైఎస్సార్సీకి ద‌క్కింది… పెడ‌న మున్సిపాలిటికీ గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11మంది కౌన్సిల‌ర్లు వైఎస్సార్సీ త‌ర‌ఫున గెల‌వ‌గా… మ‌రో 11మంది టీడీపీ త‌ర‌ఫున గెలిచారు…ఎక్స్ అఫిషీయో స‌భ్యుడిగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు ఉన్నారు.. దీంతో టీడీపీదే చైర్మ‌న్ పీఠం అనుకుంటున్న త‌రుణంలో కౌన్సిల‌ర్ స్ర‌వంతి టీడీపీకి కాజా తినిపించారు… టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఆమె వైసీపీ అభ్య‌ర్థికి ఓటు వేయ‌డంతో చైర్మ‌న్ సీటును జ‌గ‌న్ పార్టీ ద‌క్కించుకుంది…

మ‌రోవైపు పెడ‌న మండ‌ల ప‌రిష‌త్ పీఠం కూడా వైసీపీకే ద‌క్కింది… ఇక్క‌డ వైఎస్సార్సీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త ఉంది… పెడ‌న రిజ‌ల్ట్స్ టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబును కూడా ఖంగు తినిపించాయి.. ఆప‌రేష‌న్ ఆకర్ష్‌తో వైఎస్సార్సీని చావుదెబ్బ కొట్టాన‌ని, ఆ పార్టీని ఖాళీ చేయించాన‌ని సంబ‌ర ప‌డుతున్న చంద్ర‌బాబుకు ఈ ఫ‌లితాలతో ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది. చంద్ర‌బాబు మాట‌ల‌ను జ‌న‌మే కాదు టీడీపీ నేత‌లు కూడా పెడ‌చెవిన పెడుతున్న‌ట్టు పెడ‌న ఫ‌లితం నిరూపించిందని వైఎస్సార్సీ సంబ‌రాలు చేసుకుంటోంది.

Loading...

Leave a Reply

*