చంద్ర‌బాబు బాషెందుకు మారింది?

babu

తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నేత‌ల్లో చంద్ర‌బాబుకున్నంత స‌హ‌నం మ‌రే నేత‌కు ఉండ‌ద‌ని పేరు. ప్ర‌తిప‌క్షాల‌ను అయినా, ప్ర‌త్య‌ర్థుల‌నైనా ఆయ‌న త‌న రాజ‌కీయంతో ఎదుర్కొంటారు కానీ, దిగ‌జారి మాట్లాడ‌రు. ప్ర‌తిప‌క్ష నేత ఎంత రెచ్చ‌గొట్టినా, చెప్పుతో కొట్టండ‌ని పిలుపునిచ్చినా చంద్ర‌బాబు మాత్రం ఆ స్థాయికి దిగ‌జార‌లేదు. అలాంటి చంద్ర‌బాబు గ‌త వారం రోజులుగా అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. ఆయ‌న నోటి వెంట ఎప్పుడూ విన‌ని భాష ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తోంది. నాలుగు రోజ‌లు కింద‌ట వైసీపీని తీవ్ర‌వాద పార్టీతో పోల్చిన చంద్ర‌బాబు తాజాగా విప‌క్ష పార్టీల‌న్నింటిని టెర్ర‌రిస్టు పార్టీలంటూ మండిప‌డ్డారు. ఎవ‌రు ఎన్ని అనుకున్నా త‌న మానాన తాను త‌న ప‌ని చేసుకుపోయే చంద్ర‌బాబు ఇలా ఎందుకు దిగ‌జారిపోయారా అన్న విష‌య‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

మొన్నామ‌ధ్య ఏలూరులో త‌న స‌భ‌కు ఎక్కువ మంది విద్యార్థులు రాలేదంటూ తీవ్ర అస‌హ‌నానికి గురైన చంద్ర‌బాబు వేదిక‌పైనే స్థానిక ఎమ్మెల్యేని చెడ‌మడా తిట్టేశారు. అది చూసిన వాళ్లంతా ఇదేంటి చంద్ర‌బాబు ఇంత ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారంటూ విస్తుపోయారు. ఇప్పుడు ఏకంగా విప‌క్ష పార్టీల‌ను తీవ్ర‌వాదుల‌తో పోలుస్తు ఆయ‌న మాట్లాడుతుండ‌డం వెనుక కార‌ణం ఏమిటో అర్థం కాక టీడీపీ నేత‌లే త‌ల ప‌ట్టుకుంటున్నారు. విప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు త‌న అభివృద్ధితో బ‌దులివ్వాల్సిన చంద్ర‌బాబు ఇలా నోటికి ప‌ని చెప్ప‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల‌లో టీడీపీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు రావాల్సినంత మ‌ద్ద‌తు రాక‌పోవ‌డ‌మే అయి ఉంటుంద‌ని కొంద‌రంటున్నారు.

Loading...

Leave a Reply

*