అజిత్‌నే అమ్మ ఎందుకు సెలెక్ట్ చేశారు?

ajith

త‌న వార‌సుడిగా అజిత్‌నే అమ్మ ఎందుకు ఎంపిక చేశారు… ఇప్పుడు త‌మిళ‌నాడును ఈ ప్ర‌శ్న కుదిపేస్తోంది… త‌మిళ‌తంబీల‌ను ఉత్కంఠ‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది….అయితే దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయంటున్నారు త‌మిళ రాజ‌కీయ మేధావులు… కోలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ త‌ర్వాత స్థానం అజిత్‌కుమార్‌దే… త‌మిళ‌నాడులో అజిత్ బ‌డా హీరో… ర‌జినీకాంత్‌ని మిన‌హాయిస్తే అజిత్‌ను కోలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరో అని చెప్ప‌వ‌చ్చు…. మ‌రో అగ్ర హీరో విజ‌య్ నుంచి గ‌ట్టి పోటీ ఉన్నా యూత్‌లో అజిత్‌కే ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌… అంద‌గాడైన అజిత్‌ను మ‌హిళ‌లు కూడా ఎంతో అభిమానిస్తారు, ఆరాధిస్తారు… దీనికితోడు అజిత్‌ వివాదర‌హితుడు… గొడ‌వ‌ల్లో అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చ‌డు… త‌న ప‌నేదో తాను చేసుకుపోతాడు… అంతేకాక అజిత్‌కి సేవాగుణం చాలా ఎక్కువ‌…. ఎన్నో దాన‌ధ‌ర్మాలు చేస్తాడు… చారిటీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంలో ముందుంటాడు…

వీట‌న్నింటికి మించి జ‌య‌ల‌లిత‌ను త‌న క‌న్న‌త‌ల్లిగా భావిస్తాడు అజిత్‌… ఆ విష‌యాన్ని ఆయ‌న ఎప్పుడు దాచుకోలేదు… స‌మ‌యం సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెబుతాడు…. త‌మిళ‌నాడులో ఏ వేదిక ఎక్కినా జ‌య‌ల‌లిత త‌న త‌ల్లి అంటాడు ఈ బ‌డా స్టార్‌… అజిత్‌లోని ఈ క్వాలిటీస్ జ‌య‌ల‌లిత‌కు బాగా న‌చ్చాయి… ఆమె కూడా అజిత్‌ను ఎంతో అభిమానిస్తారు.. క‌న్న‌బిడ్డ కంటే ఎక్కువ‌గా చూసుకుంటారు… గ‌తంలోనే అజిత్‌ని త‌న ఇంటికి పిలిపించి మాట్లాడారు జ‌య‌… అన్నాడీఎంకే గురించి, పార్టీ భ‌విష్య‌త్తు గురించి అజిత్‌తో చ‌ర్చించారు ఆమె… అజిత్‌తో త‌న పార్టీ గురించి చ‌ర్చించాల్సిన అవ‌స‌రం జ‌య‌కు లేదు… అయినా ఆమె చ‌ర్చించారంటే ఏంటి విష‌యం… అజిత్‌ను త‌న వార‌సుడిగా ఆమె ఎంపిక చేసిన‌ట్టే అని అన్నాడీఎంకే వ‌ర్గాలు చెబుతున్నాయి… అజిత్‌లోని మంచి క్వాలిటీస్ జ‌య‌కు న‌చ్చాయ‌ని అందుకే ఆమె అత‌డ్ని మెచ్చి త‌న వార‌సుడిగా ఎంపిక చేసింద‌ని తమిళ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Loading...

Leave a Reply

*