బాబు భ‌య‌ప‌డుతున్న‌ది ఇందుకేనా?

chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబులో భ‌యం మొద‌లైన‌ట్లే ఉంది. మొన్న ఎమ్మెల్యేల శిక్ష‌ణ శిబిరంలో బాబు ప్ర‌సంగం. నిన్న‌టికి నిన్న కేబినెట్ స‌మావేశంలో… దానికి ముందు పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో సీఎం మాట్లాడిన తీరు చూస్తుంటే.. బాబులో భ‌యం మొద‌లైన‌ట్లే ఉంది. రానున్న ఎన్నిక‌ల‌లో గెల‌వ‌డంపై బాబులో క‌ల‌వ‌రం మొద‌లైన‌ట్లే ఉంది. అందుకే ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై సీరియ‌స్ అవుతున్నారు. శిక్ష‌ణ శిబిరంలో ఎమ్మెల్యేలంద‌రి జాత‌కాల‌ను నివేదిక‌ల రూపంలో ఇచ్చిన చంద్ర‌బాబు… జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే భవిష్య‌త్తు ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. అలాగే, మంగ‌ళ‌వారం కేబినెట్‌లో, పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న స్వ‌రం పెంచి మ‌రీ హెచ్చ‌రిక‌లు చేశారు. మంత్రులు సైతం ఇసుకు మాఫియాకు స‌హ‌క‌రిస్తున్నార‌ని త‌న ద‌గ్గ‌ర పూర్తి స‌మాచారం ఉంద‌ని వెల్ల‌డించారు.

ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌ని బాబు హెచ్చ‌రించారు. అలాగే, కొంద‌రు మంత్రుల పేర్ల‌ను ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావించిన‌ట్లు తెలిసింది. అలాగే, ఇసుక దందాలు చేస్తున్న‌వారికి స‌హ‌క‌రిస్తున్న ఎమ్మెల్యేలంద‌రి జాత‌కాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని చెప్పారు. ఇక‌పై ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే వారి విష‌యంలో మ‌రో నిర్ణ‌యం తీసుకోక తప్ప‌ద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయ‌కుల‌ను ఇలాగే వ‌దిలేస్తే రాబోయే రోజుల్లో క‌ష్టాలు త‌ప్ప‌వంటూ వ‌చ్చిన నిఘా నివేదిక‌ల స‌మాచారం నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు క‌ఠినంగా మాట్లాడుతున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు ఉన్నందున ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డాల‌న్న‌ది బాబు యోచ‌న‌గా క‌నిపిస్తోంది.

Loading...

Leave a Reply

*