వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి తెర‌మ‌రుగు

ys-vijayamma

వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌ల‌క్ష్మి ఈ మ‌ధ్య పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పార్టీ పెట్టిన తొలి నాళ్ల‌లో విజ‌య‌ల‌క్ష్మి పార్టీ కార్య‌క్ర‌మాలలో చురుగ్గా పాల్గొనేవారు. జ‌గ‌న్ చేసిన ఓదార్పు యాత్ర‌ల్లో కూడా ఆమె త‌న కుమారుడి వెన్నంటి ఉండేవారు. గ‌త ఎన్నిక‌ల‌లో కూడా ఉత్త‌రాంద్ర‌లో పాగా వేయాల‌ని భావించిన జ‌గ‌న్‌… విశాఖ నుంచి లోక్‌స‌భ‌కు విజ‌య‌ల‌క్ష్మిని జ‌గ‌న్ బ‌రిలోకి దించారు. ఆ ఎన్నిక‌ల‌లో విశాఖ ఓట‌ర్లు విజ‌య‌ల‌క్ష్మిని ఓడించారు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు పార్టీ కార్య‌క్ర‌మాల్లో అడ‌పాద‌డ‌పా పాల్గొన్న విజ‌య‌ల‌క్ష్మి కొన్నాళ్లు గ‌డిచిన త‌ర్వాత బ‌య‌ట‌కు రావ‌డం త‌గ్గించేశారు. ఇప్పుడైతే పూర్తిగా పార్టీ నిర్వ‌హించే బ‌హిరంగ కార్య‌క్ర‌మాల‌కు విజ‌య‌ల‌క్ష్మి హాజ‌రు గ‌గ‌న‌మై పోయింది.

ఇక‌, పార్టీ నేత‌లు కూడా విజ‌య‌ల‌క్ష్మిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా జ‌రిగిన జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భే నిద‌ర్శ‌నం. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం నిర్వ‌హించిన ఈ భారీ స‌భ‌లో ఎక్క‌డా విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌స్తావ‌న లేదు. స‌భా మైదానంలో భారీ వేదిక నిర్మించిన పార్టీ నేత‌లు దానిని జ‌గ‌న్ ఫోటోల‌తో నింపేశారు. ఇక్క‌డా పార్టీ గౌర‌వాద్యక్షురాలు విజ‌య‌ల‌క్ష్మి పేరును కానీ, ఫొటోల‌ను కానీ వేదిక‌పై ఏర్పాటు చేయ‌లేదు. అలాగే, స‌భా ప్రాంగణంలో ఏర్పాటు చేసి భారీ క‌టౌట్ల‌లో కూడా ఎక్క‌డా విజ‌య‌ల‌క్ష్మి ఫొటో క‌నిపించ‌లేదు. పార్టీ నేత‌లు ఇలా ఎందుకు చేశారో తెలియ‌దు కానీ, స‌భ‌కు వ‌చ్చిన వారు మాత్రం విజ‌య‌ల‌క్ష్మి ఫొటో లేకుండా చేశారే అంటూ మాట్లాడుకోవ‌డం క‌నిపించింది.

Loading...

Leave a Reply

*