ఆర్కే ఎక్క‌డున్నారు… ఎమ‌య్యారు? హైకోర్టులో ఫిటిష‌న్‌

rk

మావోయిస్టు అగ్ర‌నేత ఆర్కే వ్య‌వ‌హారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఏవోబీ ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత ఆర్కే ఆచూకీ తెలియ‌కుండా పోయిన సంగ‌తి తెలిసిందే. పోలీసులే ఆర్కేను అదుపులోకి తీసుకున్నార‌ని కొంద‌రు మావోయిస్టు నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్ర‌జా సంఘాల నేత‌ల‌దీ ఇదే మాట‌. అయితే, పోలీసులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఆర్కే వంటి నేత త‌మ వ‌ద్ద ఉంటే త‌క్ష‌ణం అరెస్టు చూపి తాము గెలిచామ‌ని చెప్పుకుంటాం క‌దా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత ఆర్కే ఆచూకీ తెలియ‌డం లేద‌ని ఆయ‌నను పోలీసులే అదుపులోకి తీసుకుని చిత్ర‌హింస‌లు పెడుతున్నార‌ని శిరీష చెబుతున్నారు.

త‌క్ష‌ణం అర్కేను కోర్టులో హాజ‌రుప‌రిచేలా ఆదేశాలివ్వాల‌ని కోరుతూ ఆమె హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేశారు. ఎన్‌కౌంట‌ర్ స‌మ‌యంలో ఆర్కే గాయ‌ప‌డ్డార‌ని ఆయ‌న ఇంకా పోలీసులు అదుపులో ఉన్నార‌ని తాము భావిస్తున్నామ‌ని శిరీష తెలిపారు. ఈ పిటిష‌న్ మ‌ధ్యాహ్నం విచార‌ణ‌కు రానుంది. గాయ‌ప‌డిన ఆర్కేను పోలీసులు ప‌ట్టుకెళ్లార‌ని మావోయిస్టు నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆడ‌విలో దాక్కున్న వారు లొంగిపోతే గాయ‌ప‌డిన వారికి వైద్య చికిత్స చేయిస్తామ‌ని డీజీపీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను వారు ఈ సంద‌ర్భంగా మావోయిస్టులు ప్ర‌స్తావిస్తున్నారు.

Loading...

Leave a Reply

*