బాబు సీల్డ్ క‌వ‌ర్‌లో ఏ పేజీలో ఏముంది?

chandra-babu

ఎమ్మెల్యే ప‌నితీరుపై చంద్ర‌బాబు సీల్డ్ క‌వ‌ర్లు ఇచ్చారు. రెండు ర‌కాల స‌ర్వేలు చేయించి పూర్తి స్థాయి నివేదిక‌ను వారికి అంద‌జేశారు. బ‌య‌ట‌కు చెబితే చ‌ర్చ‌లు తీవ్రంగా ఉంటాయ‌ని చెప్పిన వారెవ‌రో త‌న‌కు తెలిసిపోతుంద‌ని కూడా హెచ్చ‌రించారు. దాంతో ఎమ్మెల్యేలంతా కిమ్మ‌న‌కుండా క‌వ‌ర్లు ప‌ట్టుకుని ఇళ్ల‌కు వెళ్లిపోయారు. ఇప్పుడా క‌వ‌ర్ల‌లో ఏముందా అన్న‌ది అంద‌రి మ‌దిని తొలుస్తోంది. అయితే, ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారు త‌మపై బాబు ఇచ్చిన నివేదిక‌ను చ‌దివేసి గుట్టుగా మ‌న‌సులోనే ఉంచేసుకున్నారు. దాంతో పిడికిలి మూసే ఉంది. అందుకే ఆస‌క్తి రెట్టింపు అయ్యింది. ఎనిమిది పేజీలున్న నివేదిక‌లో స్టార్టింగే గ్రేడింగ్ వివ‌రాలు ఉన్నాయి. దానికి తోడు ఓట‌ర్లు, నియోజ‌క‌వ‌ర్గ వివ‌రాల‌ను ఉంచారు. ఇక రెండో పేజీలో బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల విష‌యంలో నేత‌ల ప‌రిస్థితి వివ‌రించారు. మూడు, నాలుగు పేజీ్ల్లో పార్టీ ప‌రిస్థితి, కార్య‌క‌లాపాల‌ను పేర్కొన్నారు. ఐదో పేజీలో నేత‌ల దందాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

దీనిపై కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా ప్ర‌స్తావించారు. ఏడో పేజీలో త‌ప్పులు దిద్దుకోవ‌డం, ఎనిమిదో పేజీలో ప్ర‌జ‌ల‌కు ఎలా చేరువ కావాలో, నేత‌ల వైఖ‌రితో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎలా బ‌లం పుంజుకుంటుందో వివ‌రించారు. ఇలాంటి స‌ర్వే నివేదిక‌లు ఇక‌పై మూడు నెల‌ల‌కోసారి ఇస్తామ‌ని కూడా చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. నివేదిక చ‌దివిన వారికి త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి, త‌మ సంగ‌తి పూర్తిగా అక్ష‌ర రూపంలో ఉండ‌డంతో అర్థం కావ‌డంతో చ‌దువుకుని సైలెంట్ అయిపోయార‌ట‌.

Loading...

Leave a Reply

*