స‌రిహ‌ద్దులో ఏం జ‌రుగుతోంది?

indian-border

భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. భార‌త ఆర్మీ పీవోకేలోకి వెళ్లి ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్ట‌డంతో ఏర్ప‌డ్డ ఉద్రిక్త‌తలు కొన‌సాగుతున్నాయి. దీంతో పంజాబ్‌, జ‌మ్మూ క‌శ్మీర్‌లోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని గ్రామాల ప్ర‌జ‌లు ఇల్లు వాకిళ్లు వ‌దిలి త‌ర‌లిపోతున్నారు. పాకిస్థాన్ ఎప్పుడెలా స్పందిస్తుందో తెలియ‌ని జ‌నం సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. భార‌త ఆర్మీ కూడా ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి, నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న గ్రామీణులంతా ఇప్పుడు భ‌యం గుప్పిట్లో క్ష‌ణ‌మొక యుగంగా గ‌డుపుతున్నారు.

ఎప్పుడు ఎటువైపు నుంచి దాడులు జ‌రుగుతాయో అన్న ఆందోళ‌న వారిలో వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దు ఎక్కువ‌గా పంజాబ్‌లోనే ఉంది. దాదాపు 553 కిలోమీట‌ర్ల స‌రిహ‌ద్దు ప్రాంతం ఈ రాష్ట్రంలోనే ఉంది. 1965, 71ల్లో జ‌రిగిన యుద్ధాల్లో రెండు దేశాల సైనికులు ముఖాముఖి త‌ల‌ప‌డింది ఇక్క‌డే. ఈ క్ర‌మంలోనే ఈ స‌రిహ‌ద్దుల్లోని ప్ర‌జ‌లు భ‌యంతో వణికిపోతున్నారు. రాత్రిపూట ఇళ్ల‌ల్లో ఉండ‌కుండా బంక‌ర్లు, ఇత‌ర సుర‌క్షిత ప్రాంతాల‌లో త‌ల‌దాచుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*