కేటీఆర్ దిగులు వెనుక‌?

ktr

తెలంగాణ సీఎం కేసీఆర్ వార‌సునిగా వెలుగొందుతున్న వ్య‌క్తి కేటీఆర్‌. రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు తెలంగాణ‌లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. పార్టీ నేత‌లు అయినా.. సాధార‌ణ ప్ర‌జ‌లైనా అంద‌రూ త‌మ బాధ‌లు ఆయ‌న‌కే చెప్పుకుంటారు. మ‌రి ఆయ‌నేకేం దిగులుందంటారా? ఆయ‌నా బాధ‌ప‌డుతున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియ‌క ట్విట్ట‌ర్‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అలాగే, ఇప్పుడు కూడా త‌న ఆవేద‌న‌ను ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. ‘‘సరిగ్గా రెండు నెలల క్రితం మనం నీటి కొరతపై ఆందోళన చెందాం. నీటి పొదుపు ఆవశ్యకతపై అప్పుడు దృష్టిపెట్టాం.

ఆశ్చర్యకరంగా ఇప్పుడు నీట మునిగిన ప్రాంతాలపై దిగులు చెందుతున్నాం’’ అని మంత్రి కేటీఆర్ త‌న సామాజిక సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవ‌లి వ‌ర‌ద‌లు, నీట మునిగిన హైద‌రాబాద్ గురించి మంత్రి ఇలా త‌న దిగులును వెల్ల‌డించారు. ఇక‌, తన మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన టీ హ‌బ్‌పైనా కేటీఆర్ భిన్నంగా స్పందించారు. ‘‘దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ అయిన ఈ రాక్షస భవనం.. ఆఫీసులకు ఎక్కడా లేని అత్యంత చల్లని ప్రదేశం. ఒకేచోట 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ఇంక్యుబేటర్‌ తెలంగాణకు ఉత్ర్పేరకం’’ అని స‌రికొత్త‌గా ట్వీట్ చేశారీ తార‌క‌రామారావు.

Loading...

Leave a Reply

*