చంద్ర‌బాబు కొత్త క‌ల ఏమిటి?

chandra-babu

క‌ల‌లు క‌నండి.వాటిని సాకారం చేసుకోండి. మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం చెప్పిన మాట‌. అది ఎప్ప‌టికీ దేశ యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌నం. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓక క‌ల ఉంది. అది డిజిట‌ల్ క‌ల‌. ఏపీని దేశంలో సాంకేతికత‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా చేయాల‌న్న క‌ల‌. ఆ క‌ల‌ను త్వ‌ర‌లోనే సాకారం చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. డిజిట‌ల్ రంగంలో తాను సాధించ‌బోతున్న ప్ర‌గ‌తిని రేపు దేశ‌మంతా అనుస‌రిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రిగిన డిజిట‌ల్ ఇండియా స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగించారు. ఏపీలో ప్ర‌తి ఇంటికి అత్యంత చ‌వ‌క ధ‌ర రూ.

149కే ఫోన్‌, ఇంట‌ర్నెట్‌, కేబుల్ టీవీని అందించ‌నున్నామ‌ని త్వ‌ర‌లోనే ఇది పూర్త‌వుతుంద‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీలోని ఐదు కోట్ల మందితో ఒకేసారి వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించే ఘ‌న‌త ఏపీ సొంతం కానుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి అంగుళంలో నివ‌సించే జ‌నం స‌మ‌చారం…. ఎప్పుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో నిమిషాల్లో తెలుసుకునే వెసులుబాటును అందుబాటులోకి తేనున్నామ‌ని చెప్పారు. సాంకేతిక‌త విష‌యంలో ఏపీని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకోవాల్సి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు జోస్యం చెప్పారు.

ధ‌నికుల కోస‌మే ఐటీ అన్న భాన‌ను మార్చి పేద‌ల సంక్షేమానికి ఐటీని ఎలా వినియోగించ‌వ‌చ్చో చేత‌ల్లో చేసి చూపిస్తామ‌న్నారు. ఇక‌, దీనికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ మాట్లాడుతూ… బెంగాల్‌ ఈరోజు చేసిందాన్ని దేశం రేపు చేస్తుంద‌ని ఒక‌ప్పుడు అనేవారని ఇప్పుడా ప‌రిస్థితి మారి ఏపీలో ఏం జ‌రుగుతుంతో రేపు దేశం దాన్ని అనుస‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కొనియాడారు.

Loading...

Leave a Reply

*