లోకేశ్ అనారోగ్యం ఏమిటి?

lokesh

టీడీపీ యువనేత‌, చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సుడు లోకేశ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు తెలిసింది. ఆ అనారోగ్యం వ‌ల్ల‌నే ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల శిక్ష‌ణా శిబిరానికి కూడా లోకేశ్ హాజ‌రు కాలేక‌పోయారు. అయితే, ఆ అనారోగ్యం ఏమిటో ఇప్పుడు బ‌య‌ట‌కొచ్చింది. లోకేశ్ కొన్నాళ్లుగా స్పాండిలైటిస్‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు తెలిసింది. దానికి ఆయ‌న ఇటీవ‌ల చికిత్స తీసుకుంటున్న విష‌యం పార్టీ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది. ఆ చికిత్స క్ర‌మంలోనే లోకేశ్ శిక్ష‌ణ శిబిరం జ‌రిగిన తొలి రెండు రోజులు దానికి హాజ‌రు కాలేక‌పోయారు. ప్ర‌స్తుతం కూడా ఆయ‌న స్పాండిలైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నార‌ని ఆయ‌న‌కు వైద్యులు ఫిజియోథెర‌పీ చేస్తున్నార‌ని తాజా స‌మాచారం. అందుక‌నే ఇటీవ‌ల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నార‌ని తెలిసింది.

అయితే, ఈ విష‌యం తెలియ‌ని చాలామంది పార్టీ నేత‌లు లోకేశ్‌ను మ‌రింత ఎక్కువ స‌మ‌యం పార్టీకి, కార్య‌క‌ర్త‌ల కోసం కేటాయించేలా చూడ‌మ‌ని కోరార‌ట‌. దానికి స్పందించిన చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే అన్నీ స‌ర్దుకుంటాయ‌ని లోకేశ్ మ‌రింత‌గా పార్టీ కార్యాల‌యంలో అందుబాటులో ఉంటార‌ని సీఎం తమ పార్టీ నేత‌ల‌కు భ‌రోసా ఇచ్చార‌ట‌.

Loading...

Leave a Reply

*