నెల్లూరులో టీడీపీ-వైఎస్సార్‌సీ వార్‌..!

nellore

నెల్లూరులో వైసీపీ నేత‌ల‌కు, వైసీపీ నుంచి టీడీపీ చేరిన నేత‌ల‌కు మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు న‌డుస్తున్నాయి. ఈ జిల్లాలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్‌, న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇద్దరూ ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల క‌త్తులు దువ్వుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ వాదులాడుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప‌తాక స్థాయికి చేర‌డంతో రాజీనామాల‌పై ఇద్ద‌రూ స‌వాళ్లు విసురుకున్నారు. ఇద్ద‌రం రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు పోదామ‌ని ఎవ‌రు గెలుస్తారో చూద్దామ‌ని మేయ‌ర్ అజీజ్…

ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు స‌వాలు విసిరాఉ. ఎవ‌రు ఓడిపోతే వాళ్లు న‌గ‌రం విడిచి వెళ్లిపోదామంటూ వ్యాఖ్యానించారు. న‌గ‌ర స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే ఏనాడూ ప‌ట్టించుకోలేద‌ని అజీజ్ ఆరోపించారు. గ‌త పాల‌క‌వ‌ర్గం చేసిన రూ.40 కోట్ల అప్పుల‌ను తీర్చిన త‌మ పాల‌క‌వ‌ర్గం ఇప్పుడు నెల్లూరును అభివృద్ధి బాట‌లో ప‌య‌నింప‌చేస్తున్నామ‌ని అజీజ్ తెలిపారు. అయితే, త‌మ అభివృద్ధి ప‌నుల‌ను స‌హించ‌లేక‌నే ఎమ్మెల్యే అడ్డంకులు క‌ల్పిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Loading...

Leave a Reply

*