మోడీపై ముఖ్య‌మంత్రుల‌తో కేసీఆర్ వార్‌!

untitled-5

న‌ల్ల‌ధ‌నంపై మోడీ యుద్ధం ప్ర‌క‌టించారు. నోట్లు ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మోడీపై దేశంలోని ముఖ్య‌మంత్రులు వార్ బెల్స్ మోగించారు. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొలేక మోడీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగారంటూ ప‌లువురు ముఖ్య‌మంత్రులు మోడీపై విరుచుకుప‌డుతున్నారు. వీరిలో మ‌మ‌తా బెన‌ర్జీ, కేజ్రీవాల్‌, ములాయంలు మోడీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీళ్లంద‌రిని ఒక్క‌తాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఒక జాతీయ ప‌త్రిక‌లో మోడీకి వ్య‌తిరేకంగా ముఖ్య‌మంత్రుల‌తో ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ క‌థ‌నం వెలువ‌డింది.

ఇక‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే, మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నోట్ల ర‌ద్దు వెనుక భారీ కుట్ర జ‌రిగింద‌ని బీజేపీ నేత‌ల‌కు ముందుగానే స‌మాచారం ఇచ్చి వారంతా స‌ర్దేసుకున్నాక నోట్ల‌ను నిషేధించార‌ని కేజ్రీవాల్ విమ‌ర్శించారు. ఇందుకు ప్ర‌ధాన తార్కాణం…. గ‌త నెల‌లో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తుల‌న బంగారం, డాల‌ర్లు కొన్నార‌ని వారికి విష‌యం ముందుగా తెలియ‌క‌పోతే ఇంత పెద్ద ఎత్తున కొనుగోళ్లు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. నోట్ల ర‌ద్దు స‌మాచారాన్ని ఎవ‌రెవ‌రికి చెప్పారో బీజేపీ నేతేలే జాబితా విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, మ‌మ‌త‌, ములాయం, మాయ‌వ‌తి స‌హా ప‌లువురు నేత‌లు మోడీపై చేసిన విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి.

Loading...

Leave a Reply

*