ఓటుకు నోటులో రేవంత్‌కు ఊర‌ట‌

revanth-reddy

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డికి ఊర‌ట ల‌భించింది. ఆ కేసులో ఆయ‌న పొందిన ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఏసీబీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం కొట్టి వేసింది. కోర్టు ఇచ్చిన ష‌ర‌తుల‌ను రేవంత్ ఉల్లంఘించార‌ని, రెండుసార్లు బ‌హిరంగ వేదిక‌ల‌పై ప‌రిధి దాటి మాట్లాడార‌ని ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, న్యాయ‌స్థానం విధించిన ష‌ర‌తుల‌ను రేవంత్ ఉల్లంఘించ‌లేద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం ఏసీబీ వేసిన పిటిష‌న్ కొట్టి వేసింది. రేవంత్ బెయిల్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

అలాగే, బెయిల్ ఇచ్చిన స‌మ‌యంలో విధించిన ష‌ర‌తుల‌ను కూడా స‌డ‌లించింది. అప్ప‌ట్లో బెయిల్ మంజూరు చేస్తూ…. ప్ర‌తి సోమ‌వారం కేసు ద‌ర్యాప్తు అధికారి ఎదుట హాజ‌ర‌వ్వాలంటూ రేవంత్‌ను న్యాయ‌స్థానం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ ష‌ర‌తును ఎత్తివేస్తున్న‌ట్లు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు. అయితే, ఏసీబీ అధికారులు కోరిన స‌మ‌యంలో మాత్రం రేవంత్ వారి ఎదుట హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Loading...

Leave a Reply

*