అమ్మా బ‌య‌ట‌కు రా!

jayalalitha

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న నెల‌కొంది. ఆస్ప‌త్రి వ‌ర్గాలు విడుద‌ల చేస్తున్న బులెటిన్ల‌తో ఆమె అభిమానాలు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు తీవ్ర క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. గ‌త కొన్నాళ్లుగా జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో ఉండి చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎం ఆరోగ్య ప‌రిస్థితిపై మాకు స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ క‌రుణానిధి డిమాండ్ చేయ‌డంతో ఒక్క‌సారిగా అంద‌రు క‌ల‌వ‌రానికి గుర‌య్యారు. దానికితోడు సోష‌ల్ మీడియాలో వ‌దంత‌లు జోరుగా వ్య‌పించ‌డంతో ఆ ఆందోళ‌న మ‌రింత పెరిగింది. ఈ ద‌శ‌లో చెన్నై వ‌చ్చిన ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ఆస్ప‌త్రికి వెళ్లి జ‌య‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చారు.

జ‌య బాగానే ఉన్నార‌ని చికిత్స జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఆయ‌న ఆ రోజు రాత్రి ప్ర‌క‌టించారు. అంతా ఓకే అనుకున్న ఆ తెల్లారే ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెలువ‌రించిన బులెటిన్లో జ‌య‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామ‌ని వెల్ల‌డించ‌డంతో ఒక్క‌సారిగా ఆమె అభిమానులు దిగ్ర్భాంతికి గుర‌య్యారు. అయితే, సాయంత్రినికి మ‌ళ్లీ జ‌య చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు మ‌రో బులెటిన్ విడుద‌ల చేశాయి. ఇలా వ‌రుస‌గా వెలువ‌డుతున్న బులెటిన్ల‌తో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు నిద్ర లేని రాత్రులు గ‌డుపుతున్నారు.

Loading...

Leave a Reply

*