బాబుని వెంక‌య్య ఎంత మాట‌న్నారు!

venkaya-naidu-and-chandra-babu

ఏపీ సీఎం చంద్ర‌బాబుని తాము సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నామంటూ కేంద్ర మంత్రి వెంక‌య్య వ్యాఖ్యానించారు. ఎంత చేస్తున్నా బాబు సంతృప్తిగా లేరంటూ నిష్టూరాలాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌స్తున్న ప్ర‌తీ మంత్రి ఏపీకి ఏదోక‌టి తెస్తూనే ఉన్నార‌ని వెంక‌య్య వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం సంతృప్తిగా లేర‌ని, ఇంకా ఇంకా కావాలంటూ త‌మ కోరిక‌ల చిట్టాల‌ను ముందుంచుతున్నార‌ని వెంక‌య్య అన్నారు. ఏపీలో పోస్ట‌ల్ స‌ర్కిల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వెంకయ్య చంద్ర‌బాబుపై సెటైర్లు వేశారు. దానికి చంద్ర‌బాబు అప్ప‌టిక‌ప్పుడే రిటార్ట్ ఇచ్చారు.తాము క‌ష్టాల్లో ఉన్నామ‌ని ఈ ప‌రిస్థితుల్లో ఎంత ఇచ్చినా… ఇంకా ఇంకా కావాల‌నిపించ‌డం స‌హ‌జ‌మేన‌ని వ్యాఖ్యానించారు. అందుకే తాము అడుగుతూనే ఉంటామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

పొగ‌డ‌క‌పోతే ప‌ని కాదు కాబ‌ట్టి ప‌నిలో ప‌నిగా రాష్ట్రానికి వెంక‌య్య ఎంతో చేస్తున్నారంటూ మ‌రోసారి చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల రాగాన్ని ఎత్తుకున్నారు. ఇక‌, పోస్ట‌ల్‌, టెలికాం విభాగాల‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌డాన్ని కూడా వెంక‌య్య త‌మ ఘ‌న‌త‌గా, ఏపీకి తాము చేస్తున్న గొప్ప సాయంగా పేర్కొన‌డం అక్క‌డికి వ‌చ్చిన వారిని విస్మ‌యానికి గురి చేసింది. రాష్ట్రం విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో పోస్ట‌ల్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. త‌ద్వారా ఆటోమేటిక్‌గా ఏపీకి పోస్ట‌ల్ విభాగం ఉంటుంది. దానిలో కేంద్రం ఉదారంగా స్పందించి ఏపీకి కొత్త‌గా ఇచ్చిందేమిటో మ‌రి వెంక‌య్య‌గారే చెప్పాలి. పోస్ట‌ల్‌, టెలికాం విభాగాల‌ను ఏర్పాటు చేయ‌క‌పోతే… ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌కే ఇబ్బంది అయినా ఇది దానంత‌ట అదే జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ‌. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ల‌బ్ధి ఏమిటో… రాష్ట్ర‌ యువ‌త‌కు, నిరుద్యోగుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటో వెంక‌య్య‌గారే వెల్ల‌డించాలి.

Loading...

Leave a Reply

*