వెంక‌య్య గారూ.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు వినిపించాయా..?

untitled-19

పాచిపోయిన ల‌డ్డూలిచ్చిదంటూ ప‌వ‌న్ కాకినాడ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్ర మంత్రి వెంక‌య్య ఆగ‌మాగ‌మ‌య్యారు. ఏపీకి త‌న‌కు సంబంధం లేకున్నా… మాతృభూమి అన్న కార‌ణంతో రాష్ట్రానికి తాను ఎంతో చేస్తున్నానంటూ నెల‌ల త‌ర‌బ‌డి వివ‌ర‌ణ‌లు ఇచ్చుకుంటూ పోయారు. ప‌నిలో ప‌నిగా రాష్ట్ర‌మంతా గొప్ప ప్యాకేజీ తెచ్చినందుకు స‌న్మానాలు చేయించుకున్నారు. ఇప్పుడేమో అనంత‌పురంలో స‌భ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రింత రెచ్చిపోయారు. తాను గ‌తంలో మాట్లాడితే అంద‌రూ త‌ప్పుబ‌ట్టార‌ని అందుకే తాను కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని బాగా అధ్య‌య‌నం చేశాన‌ని చెప్పారు. అంత‌గా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత తేలిదేమంటే… నాకు క‌ళ్ల‌కి క‌ళ్ల‌జోడు వ‌చ్చింది కానీ… రాష్ట్రానికి ప్యాకేజీతో వ‌చ్చిందేమీ లేద‌ని ఎద్దేవ చేశారు. చ‌ట్ట ప్రకారం ఇవ్వాల్సిన వాటికే ప్యాకేజీ క‌ల‌రిచ్చి బూజు ప‌ట్టిపోయిన ప్యాకేజీని ఇచ్చారంటూ మండిపడ్డారు.

గ‌తంలో ల‌డ్డూలు పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారంటూ అన్న‌దానికే వెంక‌య్య‌, బీజేపీ నేత‌లు రాష్ట్ర‌మంతా తిరిగి ప‌దుల సంఖ్య‌లో విలేక‌రుల స‌మావేశాలు పెట్టి ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూ కాద‌ని చెప్పుకున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ల‌డ్డూ పాచిపోతుంది కానీ డ‌బ్బు పాచిపోదు క‌దా అంటూ కొత్త లాజిక్ తీశారు. ఇప్పుడేమో మ‌రో అడుగు ముందుకేసి బూజు ప‌ట్టిన ప్యాకేజీ అంటూ దానికే స‌న్మానాలు చేయించుకుని ఊరేగుతున్నారంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ, టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో.

Loading...

Leave a Reply

*