వెంక‌య్య స‌వాలు బీజేపీ నేత‌ల దిగాలు!

ven-png1

ప్ర‌త్యేక హోదాపై వెంకయ్య చేస్తున్న స‌వాళ్ల‌తో ఏపీ బీజేపీ నేతలు దిగాలు ప‌డుతున్నారు. హోదాకు మించిన ప్యాకేజీ అంటూ వెంక‌య్య రాష్ట్రంలో ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు చోట్ల ఆత్మీయ స‌త్కారాలు కూడా పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ హోదాపై రాజీలేని పోరు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే స‌రైన స‌మ‌యంలో త‌మ ఎంపీలు రాజీనామాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మ‌రుస‌టి రోజు తెనాలి వ‌చ్చిన వెంక‌య్య ప్ర‌త్యేక హోదా కంటే ప్యాకేజీ మెరుగ‌ని తాము చెబుతున్నామ‌ని, కాదు హోదాయే ఎలా మంచిదో చెప్పేవాళ్లు బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాలు విసిరారు.

దానికి సీపీఐ నేత‌లు స్పందించారు. చ‌ర్చ‌కు కాద‌ని, బీజేపీ ఎంపీలు ఇద్ద‌రూ… ఎమ్మెల్యేలు న‌లుగురు రాజీనామాలు చేసి మ‌ళ్లీ గెల‌వాల‌ని ప్ర‌తి స‌వాలు చేశారు. గ‌త ఎన్నిక‌ల‌లో ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో పెట్టి జ‌నం ముందుకు వెళ్లి ఓట్లు వేయించుకున్న బీజేపీ నేత‌లు ఇప్పుడు హోదా ఇవ్వ‌లేం అంటున్నారు కాబ‌ట్టి అదే చెప్పి మ‌ళ్లీ ప్ర‌జా తీర్పు కోరాల‌ని డిమాండ్ చేశారు. దాంతో ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ‌డం ఏమిటంటూ మ‌ధ్య‌లో వెంక‌య్య‌, క‌మ్యూనిస్టులు చేసుకున్న సవాళ్లు చివ‌ర‌కు మా ప‌ద‌వికి ఎస‌రు తెచ్చేలా ఉన్నాయంటూ బీజేపీ ప్ర‌తినిధులు వాపోతున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*