వెంక‌య్య ఇంత‌గా హ‌ర్ట‌య్యారా?

ven

కేంద్ర మంత్రి, నెల్లూరు నేత వెంక‌య్య నాయుడు బాగానే హ‌ర్ట‌యిన‌ట్లున్నారు. పాచిపోయిన ల‌డ్డూలంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌నను ఎక్క‌డో తాకిన‌ట్లే ఉన్నాయి. జై ఆంధ్ర ఉద్య‌మంలో వెంక‌య్య మూలంగానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారంటూ జ‌న‌సేన అధినేత చేసిన ఆరోప‌ణ‌లు వెంక‌య్య‌ను సూటిగానే తాకిన‌ట్లున్నాయి. కాకినాడ స‌భ‌లో నేరుగా మాన‌వీయ వెంక‌య్యా జీ అంటూ ప‌వ‌న్ ప్ర‌సంగం మొద‌లు పెట్టిన నాటి నుంచి కేంద్ర మంత్రి ప్ర‌శాంతంగా నిద్ర‌పోతున్న‌ట్లు లేదు. ఆ మ‌రుస‌టి రోజు నుంచి వెంక‌య్య నాయుడు ప‌వ‌న్‌పై ఎదురు దాడి మొద‌లు పెట్టారు. దాదాపు నెల కావాస్తున్న విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ మ‌ళ్లీ త‌న షూటింగ్‌లు తాను చేసుకుంటున్నా వెంకయ్య‌నాయుడు మాత్రం ఊరూరు తిరుగుతూ పాచిపోయిన ల‌డ్డూల‌పై వివ‌ర‌ణ‌లు ఇచ్చుకుంటున్నారు.

హోదా వదిలేసి ప్యాకేజీ అంటూ విభ‌జ‌న హామీల‌ను వ‌ల్లెవేస్తూ మోడీ ఇచ్చిన ల‌డ్డూలు ప‌ట్టుకుని ఏపీలోని అన్ని గ్రామాల‌లో వెంక‌య్య ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న అభిమానులు కూడా వెంక‌య్య‌కు పౌర స‌న్మానాలు చేస్తున్నారు. ఆ స‌న్మాల్లో వెంక‌య్య ఒకే త‌ర‌హా ఉప‌న్యాసాన్ని ఊద‌ర‌గొడుతున్నారు. ప‌త్రిక‌లు కూడా అదే ఉప‌న్యాసాన్ని రీప్రింట్‌లు చేస్తున్నాయి. ఆ రోజు ప‌రిస్థితిని బ‌ట్టి హోదా అడిగా… ఇప్పుడు సాధ్యం కావ‌డం లేదుకాబ‌ట్టి అంత‌కంటే ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు హోదా అంటున్న వాళ్లంతా అప్పుడెందుకు మాట్లాడ‌లేదు. ఎక్క‌డికెళ్లినా వెంక‌య్య మాట‌లు ఇవే. వీటికి తోడుగా షుగ‌ర్ వ‌చ్చిన వారికి ల‌డ్డూల‌న్నీ పాచిపోయిన‌ట్లే క‌నిపిస్త‌యంటూ పాడిందే పాడుతున్నారు. వింటున్న జ‌నానికి, రాస్తున్న విలేక‌రుల‌కు విసుగ‌న్నా వ‌స్తుందో లేదో మ‌రి.

Loading...

Leave a Reply

*