త‌మిళ సీఎంపై వెంక‌య్య సూచ‌న‌-ఓకే అన్న జ‌య టీమ్  

venkaya

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌లలిత తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో ఉన్నారు….20 రోజుల నుంచి బెడ్ మీదే ఉన్నారు.. మూసిన క‌న్ను తెర‌వ‌ట్లేదు… తీవ్ర జ్వ‌రంతో ఒళ్లు కాలిపోతోంది…. చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో ఉన్న అమ్మ‌ను చూసేందుకు జ‌నం, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు బ‌య‌ట రోడ్ల‌పై ప‌డిగాపులు కాస్తుంటే వీఐపీలు, వీవీఐపీలు ఆస్ప‌త్రికి వ‌చ్చి అమ్మ‌ను ప‌రామ‌ర్శించి వెళుతున్నారు…. అయితే వాళ్లు ఎంతటి మ‌హాను భావులైనా దూరం నుంచి అమ్మ‌ను చూడాల్సిందే…… అమ్మ‌ను ఉంచిన ఐసీయూలోకి ఎవ‌రికి అనుమ‌తి లేదు… అది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడైన రాహుల్‌గాంధీ అయినా స‌రే… గ‌వ‌ర్న‌ర్ అయినా స‌రే…. చివ‌ర‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు అయినా స‌రే… ఎవ‌రైనా స‌రే దూరంగా ఉండి అద్దాల్లో నుంచి అమ్మ‌ను చూడాల్సిందే….

అలా వ‌చ్చిన వీవీఐపీలు అద్దాల్లో నుంచి అమ్మ‌ను చూసి క‌ళ్ల‌ద్దాలు తుడుచుకుని అమ్మ కోలుకుంటోంది… ధైర్యంగా ఉండండి అంటూ అన్నాడీఎంకే శ్రేణుల‌కు భ‌రోసా క‌ల్పించి వెళుతున్నారు.. అయితే తాజాగా అమ్మ‌ను ద‌ర్శించుకున్న కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు సీఎం మార్పుపై అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత‌ల‌కు స‌ల‌హా ఇచ్చారుట‌… జ‌య టీమ్ దానికి వెంట‌నే ఓకే చెప్పిందిట‌… దీంతో జ‌య‌ల‌లిత స్థానంలో కొత్త సీఎంను నియ‌మిస్తారు అనే ఊహాగానాలు త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేపాయి… అమ్మ అభిమానుల్లో క‌ల‌వ‌రం క‌లిగించాయి… అయితే వెంక‌య్య సూచ‌న మేర‌కు తాము న‌డుచుకుంటామ‌ని, అయితే సీఎం మార్పు ఉండ‌ద‌ని అన్నాడీఎంకే వ‌ర్గాలు అంటున్నాయి…

విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అందించిన స‌మాచారం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం దూత‌గా వ‌చ్చిన వెంక‌య్య‌  జ‌య‌ల‌లిత‌ను ప‌రామ‌ర్శించాక అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత‌ల‌తో భేటీ అయ్యారు… జ‌య‌ల‌లిత క్ర‌మేపీ కోలుకుంటోంద‌ని, రాష్ట్రంలో నాయ‌క‌త్వ మార్పు వ‌ద్ద‌ని, సీఎం మార్పు అంత‌కంటే అవ‌స‌రం లేద‌ని, మీరు కంగారు ప‌డ‌కుండా ఉండండి, అన్ని ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయంటూ అన్నాడీఎంకే నేత‌ల‌కు చ‌క్క‌గా చెప్పాడు వెంక‌య్య‌… దీనితో కేంద్ర మంత్రి సూచ‌న‌ల‌ను పాటిస్తామ‌ని అన్నాడీఎంకే నేత‌లు చెప్పారుట‌. అదీ సంగ‌తి.

Loading...

Leave a Reply

*