వెంక‌య్య బామ్మ‌ర్ది దందాలు

venkaiah-naidu

నెల్లూరు జిల్లాలో గ్రావెల్ అక్ర‌మ త‌వ్వ‌కాలలో కేంద్ర మంత్రి వెంక‌య్య బంధువుల పాత్రపై ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. వెంక‌య్య బామ్మ‌ర్ది భాస్క‌ర్ నాయుడు గ్రావెల్ త‌వ్వ‌కాల‌లో కీల‌క సూత్ర‌ధారిగా ఉన్నార‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర మంత్రి బామ్మ‌ర్దిని ఒడ్డున ప‌డేసేందుకు అధికారులు, పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇటీవ‌ల వైసీపీ నేత‌, ముత్త‌కూరు జ‌డ్‌పీటీసీ శివ‌ప్ర‌సాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అత‌డికి చెందిన మూడు టిప్ప‌ర్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదంతా అక్ర‌మాల‌ను అడ్డుకునేందుకు కాద‌ని గ్రావెల్ త‌వ్వ‌కాల‌కు దిగుతున్న వెంక‌య్య బామ్మ‌ర్దిని కాపాడేందుకే పోలీసులు వైసీపీ నేత‌ల‌పై దృష్టి పెట్టార‌ని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. భాస్క‌ర నాయుడిని త‌ప్పించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యే గోవ‌ర్ద‌న్ రెడ్డి ఆరోపించారు. వెంక‌య్య కోసం ఇత‌రుల‌ను బ‌లి చేస్తున్నార‌ని దాన్ని తాము స‌హించ‌బోమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Loading...

Leave a Reply

*