కేసీఆర్ పై రివర్స్ లో సినిమా

untitled-11

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ సినిమా చేయబోతున్నామని ఈమధ్యే మధుర శ్రీధర్ ప్రకటించాడు. ప్రత్యేక తెలంగాణ సాధన నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వరకు కేసీఆర్ తన జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు, అనుభవించిన కష్టాలు, దిగమింగిన అవమానాలకు దృశ్యరూపం కల్పిస్తామని… కేసీఆర్ పుట్టినరోజు నాడు సినిమాను ప్రారంభిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే వివాదాల దర్శకుడు వర్మ కూడా రంగంలోకి దిగాడు. కేసీఆర్ పై తను రివర్స్ లో సినిమా చేస్తానంటూ ట్వీట్ చేశాడు.

కేసీఆర్ పై రివర్స్ సినిమా కాబట్టి సినిమాకు ఆర్.సి.కె అని పేరు పెడుతున్నానని ఆశ్చర్యపరిచాడు. ఇక ఇక్కడితో ఆగకుండా.. ఈ సినిమాలో కేసీఆర్ బయట కనిపించే విధానం కాకుండా, ఇంటర్నల్ గా ఆయన ఆలోచనలను చూపిస్తానని వర్మ పేర్కొన్నాడు. ఆర్సీకే సినిమా బయటకు కనపడని కేసీఆర్ తెలివితేటలను చూపిస్తుందని, అదే హైలైట్ అవుతుందని తెలిపారు. చివరగా ఆర్సీకే సినిమా.. దీపికా పదుకునే అందంతో పాటు… అందంగా లేని అనేక రాజకీయాలను కలగలిపిన నిజమైన తెలంగాణ బ్రూస్ లీ కేసీఆర్ ను తెరపై చూపిస్తుందని వర్మ ఓ సరికొత్త అర్థం చెప్పాడు.

వర్మ ప్రకటనతో ఆశ్చర్యపోవడం మాట అటుంచితే నవ్వుకున్నోళ్లే ఎక్కువ. ఎందుకంటే.. హాట్ టాపిక్ ఎక్కడుంటే దాన్ని కెలిసి వదిలేయడం వర్మ హాబీ. అంతే తప్ప సినిమాలు మాత్రం తీయడు. గతంలో ఇలానే చాలా టాపిక్స్ ను కెలికి వదిలేశాడు. మందు మత్తు దిగగానే ఆ ఊసే ఎత్తడు.

Loading...

Leave a Reply

*