సెంటిమెంట్ నిలిపేందుకే కేసీఆర్ కొత్త జిల్లాలు

kcr1

కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ స‌జీవంగా ఉన్న‌న్నాళ్లే కేసీఆర్‌కు రాజ‌కీయంగా తిరుగుండ‌దు. ఈ నిజం ఆయ‌న‌కు కూడా చాలా క్లియ‌ర్‌గా తెలుసు. అందుకే ఎప్పుడూ జ‌నంలో తెలంగాణ సెంటిమెంట్‌ను త‌గ్గ‌నీయ‌కుండా చూసుకుంటారు. జై తెలంగాణ నినాదాన్ని జ‌నం మ‌ర్చిపోకుండా గుర్తు చేస్తుంటారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటును కూడా కేసీఆర్ త‌న రాజ‌కీయ చ‌తుర‌తో ముందుకు తీసుకుపోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్థికంగా భారం మిన‌హా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని విప‌క్ష నేత‌లు, నిపుణులు చెబుతున్నారు. అయితే, కేసీఆర్ దృష్టిలో మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుతో రెండు ప్ర‌యోజ‌నాలున్నాయి.

జిల్లాల స‌రిహ‌ద్దులు మార్చ‌డంతో మండ‌లాలను అటూ ఇటూ మారుస్తున్నారు. దానివల్ల ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌లంగా ఉన్న మండ‌లాల‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. దాంతో స‌మీప భ‌విష్య‌త్తులో వారి రాజ‌కీయ జీవితాన్ని దెబ్బ‌కొట్టాల‌న్న‌ది కేసీఆర్ అంచ‌నా. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌లో తెలంగాణ సెంటిమెంట్ స‌జీవంగా ఉంటుంది. లేకుంటే ప్ర‌జ‌ల దృష్టి అభివృద్ధి ప‌నులు, ఉద్యోగాలు, కొత్త రాష్ట్రం వ‌ల్ల త‌మ‌కు వ‌స్తాయ‌నుకున్న అవ‌కాశాలు ఇలా వివిధ అంశాల‌పైకి మ‌ళ్లుతుంది. అలా వారి దృష్టి మ‌ళ్ల‌కుండా తెలంగాణ సెంటిమెంట్‌ను స‌జీవంగా ఉంచ‌గ‌లిగితే త‌న‌కు తిరుగే ఉండ‌ద‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకే అడిగినోళ్ల‌కి అడిగిన‌ట్లు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చేనిధులు, ప్ర‌ణాళికా సంఘం ద్వారా వ‌చ్చే నిధులకు ప్రాతిప‌దిక జిల్లాలు కాద‌ని, జ‌నాభా మాత్ర‌మేన‌ని జ‌నం పెర‌గ‌కుండా జిల్లాలు పెంచుకుంటే వ‌చ్చే నిధులు ఎలా పెరుగుతాయ‌ని బీజేపీనేత ఇంద్ర‌సేనారెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు చాలా ప్రాధాన్య‌త ఉంది. దానికి స‌మాధానం చెప్ప‌గ‌లిగితే కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి జ‌రుగుతుంద‌న్న త‌న వాద‌న‌ను కేసీఆర్ నిరూపించుకోగ‌ల‌రు.

Loading...

Leave a Reply

*