వైసీపీలో చేరిన టీఆర్ఎస్ నేత‌

ysrcp

కొన్నిసార్లు విచిత్రాలు జ‌రుగుతుంటాయి. ఇదీ అలాగే ఉంది. తెలంగాణ‌లో ఉందో లేదో తెలియ‌ని వైసీపీలోకి అధికార పార్టీ నుంచి ఒక నేత వ‌చ్చి చేరారు. ఆంధ్ర‌ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ల‌క్కినేని సుధీర్ వైసీపీలో చేరారు. ఆయ‌న‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ హైద‌ర‌బాద్‌లోని త‌న నివాసంలో కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టిన జ‌గ‌న్ తెలంగాణ‌లో పార్టీని దాదాపుగా వ‌దిలేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డిని జ‌గ‌నే టీఆర్ ఎస్‌లోకి పంపార‌ని విప‌క్షాలు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, తెలంగాణ‌లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌ర‌రూ అంత‌కు ముందే కేసీఆర్ పంచ‌న చేరారు.

దాంతో ఏదో రెండో శ్రేణి నేత‌ల‌ను పెట్టుకుని పార్టీకి ఓ శాఖ ఉందంటే ఉంద‌న్న‌ట్లు తెలంగాణ‌లో వైసీపీని న‌డుపుతున్నారు జ‌గ‌న్‌. అక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వం కూడా వైసీపీని ఒక రాజకీయ పార్టీగా చూడ‌డం లేదు. అందుకే క‌నీసం అఖిల‌ప‌క్ష స‌మావేశాల‌కు కూడా పిల‌వ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి ఒక నేత వ‌చ్చి వైసీపీలో చేరారు. ఆయ‌న ఏం ఆశించి చేరారో కానీ వైసీపీ నేత‌లు మాత్రం త‌మ పార్టీలోకి నేత‌లు వ‌స్తున్నారంటూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఇక‌, ఏపీలో సీఎం కావాల‌ని నిత్యం క‌ల‌లు క‌నే జ‌గ‌న్‌కు అక్క‌డేమో ఉన్న ఎమ్మెల్యేలంతా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీ ఉందో లేదో తెలియ‌ని తెలంగాణ‌లో ఏమో రెండో శ్రేణి నేత‌లైనా ఒక‌రిద్ద‌రు వ‌చ్చి చేరుతున్నారు.

ఈ ఎఫ‌ర్ట్ ఏపీలో పెట్టి ఒక‌రిద్ద‌రిని త‌మ‌వైపు తిప్పుకుంటే అది జ‌గ‌న్‌కు ఎంతో కొంత మేలు చేస్తుంది కానీ తెలంగాణ‌లో ఏం వ‌చ్చినా ఏం ఉప‌యోగం అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల‌మాట‌.

Loading...

Leave a Reply

*