దేశంలో పెద్ద‌నోటు దెబ్బ‌త‌గిలిన లీడ‌ర్ల‌లో జ‌గ‌న్ ర్యాంక్ ఎంత…?

jagan

పెద్ద నోట్ల ర‌ద్దుతో అవినీతితోపాటు బ్లాక్ మ‌నీ కేటుగాళ్ల‌పై మోదీ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేశారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీ నేత‌ల్లోనూ ఈ అవినీతి బాగా పెరిగిపోయింద‌ని గ‌త కొంత‌కాలంగా వెలుగుచూస్తున్న కుంభ‌కోణాలు, స్కామ్‌లు జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే, దేశంలోని ప‌లు రాజ‌కీయ పార్టీల‌పైనా, ఆ పార్టీల అధినేత‌ల‌పైనా రీసెంట్‌గా వెలుగు చూసిన ఓ స‌ర్వే.. షాకింగ్‌గా ఉంది. ఈ లిస్ట్‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌లోని పార్టీలు కూడా టాప్ ప్లేస్‌లోనే ఉన్నాయ‌ట‌. దేశంలోని ఇత‌ర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలే ఈ అవినీతి ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

గ‌త కొన్నాళ్లుగా కాంగ్రెస్ ప్ర‌భావం ప‌డిపోవ‌డంతో ఆ పార్టీ నేత‌లపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, వారి ర్యాంక్ బాగా పడిపోయింది. ఈ లిస్ట్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ముందుందని చెబుతున్నారు. దానికి మొద‌టిప్లేస్ ఇస్తున్నారు. ఆ త‌ర్వాత ప్లేస్ త‌మిళ‌నాడులోని విప‌క్షానిది అని చెబుతున్నారు. కొద్ది తేడాతో ఏపీలోని జ‌గ‌న్‌కి కూడా భారీ ఎత్తున అక్ర‌మాస్తులు ఉన్నాయ‌ని ఆ స‌ర్వే సారాంశం అని తెలుస్తోంది. సెకండ్‌, థ‌ర్డ్ ప్లేస్‌ల మ‌ధ్య పెద్ద తేడా లేద‌ని అంటున్నారు. ఇక‌, నాలుగో స్థానంలో పంజాబ్‌లోని అధికార పార్టీ ఉంటే, అయిద‌వ పొజిష‌న్‌లో బీహార్‌లోని అధికార పార్టీ భాగ‌స్వామి ఉన్నాయ‌ని స‌మాచారం. తెలుగు రాష్ట్రాల‌లోని ఇత‌ర పార్టీలు కూడా టాప్ టెన్‌కి కాస్త అటూ ఇటూ ఉన్నాయ‌ట‌. దీంతో, సౌత్‌లో మ‌న తెలుగు పార్టీలు అవినీతి ప‌రంగా ముందున్నాయ‌ని చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌లో ఆయా పార్టీలు పెట్టిన ఖ‌ర్చు, అవినీతి ఆరోప‌ణ‌లు, కేసుల‌తో ఈ చిట్టా త‌యారయింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ లిస్టులోని చాలామంది నేత‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో 20రోజుల్లో ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఎంత‌మ‌నీ వేసుకోవ‌చ్చో ఓ అంచ‌నాకు వ‌చ్చే చాన్స్ ఉందట‌. ఇది కూడా ఆ పార్టీ నేత‌ల గుండెల్లో గుబులు రేపుతోంది.

Loading...

Leave a Reply

*