ప‌వ‌న్ స‌భ‌కు పేరు పెట్టారు!

untitled-1

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ తాను న‌వంబ‌ర్ ప‌దిన అనంత‌పురంలో నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా కాకిన‌డాలో జ‌రిగిన స‌భ‌కు సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వ స‌భ‌గా పేరు పెట్టిన ప‌వ‌న్‌…. అనంత‌పురం స‌భ‌కు సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు జ‌న‌సేన కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. అనంత‌పురం స‌భ‌కు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ‌ని ప‌వ‌న్ ఆ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు. ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడి ప్ర‌స్తావిస్తూ ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టిన ప‌వ‌న్…

కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పోల్చారు. ఆ స‌భ‌లో వెంక‌య్య‌పై నిప్పులు చెరిగారు. జై ఆంధ్ర ఉద్య‌మంలో యువ‌త ప్రాణాల‌తో నాయ‌కులు చెల‌గాట‌మాడారంటూ ప‌రోక్షంగా వెంక‌య్య‌పై మండిప‌డ్డారు. అదే స‌భ‌లో ఉత్త‌రాంధ్ర ఎంపీ అవంతి శ్రీ‌నివాస్‌పై కూడా ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు. దాంతో అవంతి శ్రీ‌నివాస్ ఆ త‌ర్వాత రోడ్డుమీద ధ‌ర్నాలు చేయాల్సి వ‌చ్చింది. ఇక‌క వెంక‌య్య నాయుడు త‌న‌పై ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల త‌ర్వాత ఏపీలో ఊరూరు తిరుగుతూ పాచిపోయిన ల‌డ్డూల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇక‌, ఇప్పుడు క‌రువు సీమ‌లో జ‌రిగే స‌భ‌లో ప‌వ‌న్ ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారా అన్న చ‌ర్చ ఇప్పుడు ఏపీ నేత‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

Loading...

Leave a Reply

*