తెలంగాణ‌లో క‌మ‌ల వికాసం!

bjp

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు బీజేపీ చెక్ పెట్ట‌బొతోందా? చాప‌కింద నీరులా వ‌చ్చే ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్‌ను ప‌డ‌గొట్టి తాను విక‌సించాల‌ని క‌మ‌లం ఉవ్విళ్లూరుతుందా? అవుననే అంటున్నాయి బీజేపీ వ‌ర్గాలు. 2019 ఎన్నిక‌ల‌లో ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచిన రాష్ట్రాల్లో సీట్లు త‌గ్గినా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. తెలంగాణ‌లో అవ‌కాశం ఉంద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన క‌మ‌ల‌నాథులు ఆ మేర‌కు పార్టీ యంత్రాంగాన్ని మరింత‌గా బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలిసింది.

ఈనేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కార్యక్రమాల నిర్వహణ, బూత్‌స్థాయి వరకు ఉన్న స్థితిపై పార్టీ సీనియ‌ర్ నేత‌ శివప్రకాష్ ఆధ్వ‌ర్యంలో పరి శీలన మొదలుపెట్టారు. గురువారం జిల్లాల్లో పర్యటించి, శుక్రవారం మళ్లీ పార్టీ ముఖ్యులతో ఆయ‌న భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత తాను స‌మీక‌రించిన‌, తెలుసుకున్న విష‌యాల‌తో పూర్తి స్థాయి నివేదిక‌ను అమిత్‌షాకు అంద‌జేయ‌నున్నారు. ఒక‌వైపు బీజేపీకి ద‌గ్గ‌ర కావాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తుంటే… బీజేపీ మాత్రం త‌మంత‌ట తాము ఎద‌గ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తోంది. ఈ క్ర‌మంలో తెలంగాణలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

Loading...

Leave a Reply

*