పార్టీలో ఎవ‌రు గొప్ప… లోకేశ్ మాటేంటి?

untitled-14

తెలుగుదేశం పార్టీలో ఎవ‌రు గొప్ప అనే అంశంపై లోకేశ్ స్పందించారు. త‌న‌కంటే, త‌న తండ్రి, ఏపీ సీఎం కంటే పార్టీయే సుప్రీం అని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఉన్న లోకేశ్‌ను కొంద‌రు టీడీపీ కార్యక‌ర్త‌లు సోమ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఆయ‌నకు ఒక విజ్ఞప్తి చేశారు. నారా లోకేశ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ పేరుతో సేవా కార్యక్రమాలు చేప‌ట్టనున్నామ‌ని ఇందుకు అంగీక‌రించాల‌ని ఆయ‌నను కోరారు.

అయితే వారి విజ్ఞప్తిని లోకేశ్ సున్నితంగా తిర‌స్కరించారు. పార్టీలో ఎవ‌రూ గొప్ప కాద‌ని, పార్టీయే సుప్రీం అని తేల్చి చెప్పారు. ఏ కార్యక్రమం చేయాల‌న్నా… అది పార్టీ పేరుతోనే జ‌ర‌గాల‌ని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలు చేయ‌డం మంచి ప‌నేన‌ని, దానిని తాను ప్రోత్సహిస్తాన‌ని అయితే, వాటిని వ్యక్తుల పేర్లతో కాకుండా పార్టీ పేరుతోనే చేప‌ట్టాల‌ని ఆయ‌న కార్యక‌ర్తల‌కు సూచించారు.

Loading...

Leave a Reply

*