2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా టీడీపీ మేధోమ‌థ‌నం

tdp

టీడీపీ నేత‌ల మేధోమ‌థ‌నం ప్రారంభ‌మైంది. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్న నేప‌థ్యంలో పార్టీలో నూత‌నోత్తేజం తేవ‌డమే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ఈ అధ్య‌య‌న త‌ర‌గ‌తుల‌ను చేప‌ట్టారు. అనంత‌పురం జిల్లాలోని కేఎల్ వ‌ర్సిటీలో పార్టీ నేత‌ల‌కు క్లాసులు చెబుతున్నారు. ఇటీవ‌ల పార్టీ ప‌రిస్తితిపై ప్ర‌జ‌లేమ‌నుకుంటున్నార‌న్న విష‌య‌మై వివిధ ప‌ద్ధ‌తుల‌లో స‌ర్వేలు చేయించుకున్న చంద్ర‌బాబు వాటిలో వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్ మేర‌కు ఇప్పుడీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు సానుకూల అభిప్రాయం ఉంద‌ని, అయితే, పార్టీ ఎమ్మెల్యేల‌పై మాత్రం తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం చంద్ర‌బాబు స‌ర్వేల్లో వ్య‌క్త‌మైనట్లు వార్త‌లొచ్చాయి.

దాంతో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను దారిలో పెట్ట‌కుంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని నిర్దారించుకున్న చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను గాడిలో పెట్టే ప‌ని చేప‌ట్టారు. మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇంచార్జీల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలను పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు మ‌రింత‌గా ఎలా చేరువ చేయాలి, అలాగే, నాయ‌కత్వ ల‌క్ష‌ణాల‌ను పెంపొందించ‌డ‌మే ఈ శిక్ష‌ణ ముఖ్య ఉద్దేశం అని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*