మోడీని చంపేస్తారు జాగ్ర‌త్త‌!

untitled-2

ఢిల్లీ పోలీసుల‌కు వ‌చ్చిన ఆ ఫోన్ కాల్ న‌గ‌ర పోలీసులంద‌రిని ప‌రుగులు పెట్టించింది. ప్ర‌ధాని మంత్రి న‌రంద్ర మోడీని చంపేందుకు కుట్ర జ‌రుగుతుందంటూ ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి గ‌త బుధ‌వారం రాత్రి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. దాంతో విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచిన పోలీసులు త‌క్ష‌ణం రంగంలోకి దిగి ఆ ఫోన్ కాల్ సంగ‌తి తేల్చే ప‌నిలో ప‌డ్డారు. పోలీసుల విచారణ‌లో బురారికి చెందిన దినేష్ కుమార్ అనే వ్య‌క్తి పేరిట ఉన్న నంబ‌ర్ నుంచి ఈ ఫోన్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా సిమ్ త‌న‌దేన‌ని కానీ తాను దానిని త‌న బంధువుకు ఇచ్చాన‌ని చెప్పాడు. దాంతో అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే, తాను ఒక హోట‌ల్‌లో ఉండ‌గా ఎవ‌రో వ్య‌క్తి వ‌చ్చి అర్జంట్‌గా ఫోన్ చేసుకోవాల‌ని చెప్పి ఫోన్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడి వ‌చ్చాడ‌ని తెలిపారు. ఇదే విష‌యాన్ని అక్క‌డి ప్ర‌త్య‌క్ష సాక్షులు కూడా వెల్ల‌డించారు. దాంతో పోలీసులు ఇప్పుడా అగంత‌కుడు ఎవ‌రా అని తేల్చే ప‌నిలో ప‌డ్డారు. అయితే, ఈ ఫోన్ కాల్ ఫేక్ అని ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు ఏం ఢోకా లేద‌ని భ‌ద్ర‌తా అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా, నోట్ల ర‌ద్దు త‌ర్వాత గోవాలో మోడీ మాట్లాడుతూ కొన్ని శ‌క్తులు త‌న‌ను హ‌త‌మార్చేందుకు కూడా వెన‌కాడ‌బోవ‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయినా స‌రే తానెవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని కూడా మోడీ ఆ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

Loading...

Leave a Reply

*