ఏటీఎమ్‌కి వెళుతున్నారా.. అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోండి..!

untitled-6-copy

నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంతో ఒక్క‌సారిగా ఏటీఎమ్‌ల ద‌గ్గ‌ర ర‌ద్దీ విప‌రీతంగా పెరిగింది. గ‌తంలో రా ర‌మ్మంటూ ఖాళీగా ఆహ్వానించే ఏటీఎమ్‌ల ముందు ఇప్పుడు చాంతాడంత క్యూలు క‌న‌బ‌డుతున్నాయి. ఒక్కో ఏటీఎమ్ ద‌గ్గ‌ర వంద‌ల మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏటీఎమ్‌లకు వెళ్లే వారికి కొన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన సూచ‌న‌లు చేస్తున్నారు నిపుణులు. ఏటీఎమ్‌ల కీ ప్యాడ్‌ల‌పై బ్యాక్టీరియాతోపాటు వివిధ రకాల సూక్ష్మ‌జీవులు ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు ప‌రివోధ‌కులు.

కీ ప్యాడ్ల‌పై ఉన్న ప‌రాన్న‌జీవులు చెడిపోయిన ఆహార బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయని చెబుతున్నారు. ఏటీఎమ్ కీ ప్యాడ్‌ల ద్వారా మ‌న‌కి చేరే ఈ బ్యాక్టీరియాతో అంద‌రికీ వ్యాప్తి చెందుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కొన్ని ఏటీఎమ్ కీ ప్యాడ్‌ల‌లో కుళ్లిపోయిన పాల ఉత్త‌త్తుల నుంచి వెలువ‌డిన లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. వీటితో ర‌క‌ర‌కాల వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వార్నింగ్ ఇస్తున్నారు.

Loading...

Leave a Reply

*