జ‌గ‌న్‌కు సుప్రీం కోర్టు షాక్

jagan

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జ‌గ‌న్‌కు మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఈ కేసులో చంద్ర‌బాబుపై విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి ఏసీబీ కోర్టునాశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ చంద్ర‌బాబుపై ద‌ర్యాప్తు చేయాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. దానిపై చంద్ర‌బాబు హైకోర్టుకు వెళ్ల‌డంతో అక్క‌డ స్టే వ‌చ్చిన సంగ‌తి విధిత‌మే. దాంతో రామ‌కృష్ణారె్డ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు శుక్ర‌వారం విచారించింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

రామ‌కృష్ణ‌రెడ్డి వేసిన పిటిష‌న్లో తాము జోక్యం చేసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. అలాగే, రాజ‌కీయ శ‌తృత్వంలోనే రామ‌కృష్ణారెడ్డి ప‌టిష‌న్ వేసిన‌ట్లు తాము భావిస్తున్నామ‌ని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉంటాయ‌ని అందువ‌ల్ల దానిని తాము అనుమ‌తించ‌బోవ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం కేసు హైకోర్టు ప‌రిధిలో ఉన్నందున ఆ న్యాయ‌స్థాన‌మే విచార‌ణ కొన‌సాగిస్తుంద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అలాగే, పిటిష‌న్‌ను నాలుగు వారాల్లోగా విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టుకు సూచించింది.

Loading...

Leave a Reply

*