మోదీ ట్విట్ట‌ర్ అకౌంట్‌కి గుడ్‌బై.. 2 రోజుల్లో 4ల‌క్ష‌ల మంది ఔట్‌…!

untitled-18

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చెయ్య‌డం మోదీకి నెగిటివ్‌గా మారుతోందా..? బ‌్లాక్‌మ‌నీపై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ అంటూ ఆయ‌న మొద‌లు పెట్టిన అవినీతిపై యుద్ధం అసలుకే మోసం తేనుందా..? దేశంలో యువ‌త దీనిపై వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోందా..? అంటే, అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

రూ.500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చెయ్య‌డంతో ప్ర‌ధాన‌మంత్రి మోదీపై ఒక్క‌సారిగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిశాయి. ఆయ‌న ముంద‌స్తు ప్లాన్ లేకుండా ఓవ‌ర్‌నైట్‌లో ఏటీఎమ్‌ల‌ను మూసివెయ్య‌డం, బ్యాంక్‌ల‌ను క్లోజ్ చెయ్య‌డంతో జ‌నాలకు చిల్ల‌ర కొర‌త ఏర్ప‌డింది. దీంతో, క‌నీసం చేతిలో పైసా లేకుండా పోయింది చాలామందికి. జేబులో చిల్లిగ‌వ్వ‌లేక‌పోవ‌డం, చిల్ల‌రకు డిమాండ్ పెర‌గ‌డంతో ఆయ‌న‌పై రెండోరోజు వ్య‌తిరేకత షురూ అయింది. అందుకే, మొద‌టిరోజు సైలెంట్‌గా ఉన్న విప‌క్షాలు.. మూడోరోజుకి జ‌నాల అవ‌స్థ‌ను చూసి బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లుపెట్టారు. మోదీపై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చెయ్య‌డం స్టార్ట్ చేశారు. కేజ్రీవాల్ వంటి నేత‌ల‌యితే.. మోదీకి శాప‌నార్ధాలు పెట్టారు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే… సోష‌ల్ మీడియాలో మోదీపై విప‌రీత‌మైన వ్య‌తిరేకత ప్రారంభ‌మ‌యింది. నిన్న‌టిదాకా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కూడా క్రాస్ చేసి ఇండియాలో ట్విట్ట‌ర్ ఫాలోయింగ్‌లో టాప్ ప్లేస్‌కి ఎదిగిన మోదీకి స‌డెన్‌గా వ్య‌తిరేకత వ్య‌క్తం అవుతోంది. 48గంట‌ల్లోనే మోదీ ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి ఏకంగా 4ల‌క్ష‌ల మంది అభిమానులు వైదొలిగారు. మోదీకి గుడ్ బై చెప్పారు. కొత్త నోట్లు, వంద నోట్ల కోసం బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల ఎదుట గంట‌ల త‌ర‌బ‌డి నిల్చోవాల్సి వ‌స్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, ఇది కొద్దికాలమే అంటోంది బీజేపీ. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగితే.. ఇంత‌కు ప‌ది రెట్లు ఆయ‌నను ఫాలో అవుతార‌ని చెబుతోంది. ఇది నిజ‌మే క‌దా మ‌రి..?

Loading...

Leave a Reply

*