అమ‌రావ‌తిలో భూమి కొన్నారా? జాగ్ర‌త్త‌!

amaravathi

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని అమ‌రావితిలో భూములు కొన్నారా?  రాజ‌ధాని అభివృద్ధి ప్రాంతం సీఆర్‌డీఏ ప‌రిధిలో భారీ స్థాయిలో భూ లావాదేవీలు నిర్వ‌హించారా? అయితే, జ‌ర భ‌ద్రం. మీపై ఐటీ అధికారుల న‌జ‌ర్ ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ఇలా భారీ సంఖ్య‌లో భూములు కొన్నావారిపైనా, లావాదేవీలు జ‌రిపిన వారికి సంబంధించిన జాబితాను ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. భారీగా సంపాదిస్తూ ప‌న్నులు ఎగ్గొడుతున్న వారిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన ఐటీ అధికారులు వేట మొద‌లుపెట్టారు. తొలిగా ఏపీకి సంబంధించిన రాజ‌కీయ నాయ‌కుల‌పై దాడులు మొద‌లుపెట్టారు. తొలిగా అధికార‌పార్టీతోనే అది మొద‌లుపెట్టారు.

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ డీకే ఆదికేశ‌వులునాయుడు భార్య స‌త్య‌ప్ర‌భ‌పై శుక్ర‌వారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదికేశ‌వులు కుటుంబానికి భారీగా వ్యాపారాలున్నాయి. అయితే, ఐటీ శాఖ‌కు చెప్పిన లెక్క‌ల కంటే ఆస్తులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని గుర్తించిన అధికారులు బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, జ‌హీరాబాద్‌, చెన్నై, పాండిచ్చేరీల్లో ఏక కాలంలో సోదాలు జ‌రిపారు. ఇంకా ఈ జాబితాలో ఇంకా ఐదుగురు రాజ‌కీయ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది. న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసే క్ర‌మంలో కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 30వ తేదీలోపు అక్రమ సంపాదన ఉన్నవారంతా స్వ‌చ్ఛందంగా ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తే చ‌ర్య‌లుండ‌వ‌ని ప్ర‌క‌టించింది.

దీనికి పెద్ద‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో ముంద‌స్తు దాడుల‌తో భ‌య‌పెట్టాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే మొద‌లుపెట్టిన దాడులు మ‌రింత మందిపై జ‌ర‌గ‌నున్నాయ‌ని అధికారుల క‌థ‌నం. ఆంధ్రప్రదేశ్‌లోని సీఆర్‌డీఏలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారు స‌హా తెలుగు రాష్ట్రాల్లో 20 నుంచి 25 మంది వ‌ర‌కూ ఈ జాబితాలో ఉన్న‌ట్లు స‌మాచారం. వీరంద‌రిపైనా ఐటీ దాడులు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

Loading...

Leave a Reply

*